Home /News /crime /

A MAN WHO WENT TO SOLVE THE PROBLEM BETWEEN TWO FRIENDS FIGHTING OVER A MOBILE EMI PAYMENT DISPUTE HAS BEEN KILLED IN PEDDAPALLIPRV

OMG: మొబైల్​ ఈఎంఐ విషయంలో ఇద్దరు మిత్రులు గొడవ పడుతుంటే మధ్యలో వెళ్లిన పాపానికి.. అంత పని చేస్తారా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఏ గొడవ ఎక్కడికి దారితీస్తుందో తెలియదు. ఇద్దరు మిత్రులు సరదాగా కొట్టుకున్నా.. చివరికి అది ప్రాణాల మీదకి తెచ్చే ఆస్కారం ఉంది. అలాంటి ఘటనే పెద్దపల్లిలో జరిగింది.

    ఏ గొడవ ఎక్కడికి దారితీస్తుందో తెలియదు. ఇద్దరు మిత్రులు (Two friends) సరదాగా కొట్టుకున్నా.. చివరికి అది ప్రాణాల మీదకి తెచ్చే ఆస్కారం ఉంది. అలాంటి ఘటనే పెద్దపల్లిలో జరిగింది. ఈఎంఐ (EMI) విషయంలో ఇద్దరు మిత్రుల మధ్య తలెత్తిన గొడవ ఓ వ్యక్తి హత్యకు దారి తీసింది.  పెద్దపల్లి (Peddapalli) జిల్లా అంతర్గాం మండలం మర్రిపల్లి గ్రామంలో, అన్న రామకృష్ణ (రఘువరన్), తమ్ముడు తాళ్లపెల్లి నరహరి సురేందర్ (21) పై కత్తితో దాడి చేయగా చికిత్స పొందుతూ తమ్ముడు మృతి చెందాడు.

    పెద్దపల్లి (Peddapalli) జిల్లా అంతర్గాం ఎస్ఐ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం. రఘువరన్ కు మృతుడి మిత్రుడు (Friend) దూట నరేష్ కి మధ్య సెల్ ఫొన్ ఈఎంఐ  (Mobile EMI)విషయంలో వివాదం తలెత్తగా రఘువరన్, నరేష్ పైకి కత్తి (Knife) తో దాడి చేయబోగా, గొడవ ను ఆపడానికి మధ్యలో వెళ్లిన రఘువరన్, తమ్ముడు సురేందర్ కి పక్కటెములో కత్తిపోట్లు దిగగానే, స్పృహ కోల్పోయిన సురేందర్ పడిపోగా స్థానికులు. గోదావరిఖని హాస్పిటల్ కి తరలించగా మృతిచెందాడని. మృతుని గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించడం జరిగిందని. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.

    చిచ్చులు పెడుతున్న చిన్న విషయాలు..

    గతంలోనూ ఓ మొబైల్​ ఓ మొబైల్​ ఫోన్ (Mobile Phone)​ స్నేహితుల మధ్య చిచ్చు పెట్టింది. ఆ గొడవ చివరికి ప్రాణం తీసే వరకు (Friend Murder) దారి తీసింది. వికారాబాద్ (Vikarabad) జిల్లా తాండూరు (Tandur) పట్టణంలో జస్వంత్‌, ప్రశాంత్, రాజు ముగ్గురు స్నేహితులు. ప్రశాంత్‌ది తాండూరు, రాజుది మల్‌రెడ్డిపల్లి, జస్వంత్‌ అంతారం గ్రామానికి చెందిన వాడు. ఒకరు రోజు ప్రశాంత్‌ తన వద్ద ఉన్న సెల్‌ఫోన్ (Cellphone) తన ఇద్దరు మిత్రులకు ఇచ్చి డబ్బులు (Money) అవసరం ఉందని దాన్ని అమ్మేసి ఇవ్వాలని చెప్పాడు. మిత్రుడికి అవసరం ఉందని వెంటనే ఆ సెల్‌ ఫోన్ (Cellphone) పట్టుకొని షాప్‌ వద్దకు వెళ్లారు రాజు, జస్వంత్. దాన్ని ఎంతకు అమ్మొచ్చో చెప్పాలన్నారు. దాన్ని పరిశీలించిన షాపు (Mobile shop) యజమాని వాళ్లపై కోపడ్డాడు. దొంగిలించిన ఫోన్ (Theft phone) తీసుకొచ్చి అంటగట్టాలని చూస్తారా అంటు మండిపడ్డాడు.

    ప్రశాంత్‌ను చంపేయడానికి ప్లాన్..

    దొంగతనం (Theft) చేసిన సెల్‌ఫోన్‌ను తమకు అంటగట్టి అవమానించాడని రాజు, జస్వంత్లు ప్రశాంత్​లు పగ పెంచుకున్నారు. ఎలాగైనా మిత్రుడు ప్రశాంత్‌కు బుద్ది చెప్పాలని భావించారు. ఇద్దరు ప్లాన్ వేసుకొని ఎలా బుద్ది చెప్పాలో అర్థం కాక చంపేయడానికి నిర్ణయించుకున్నారు. ప్రశాంత్‌ను చంపేయడానికి (Friend Murder) ప్లాన్ చేసిన మిత్రులు రాజు, జస్వంత్ మాట్లాడదామని ఊరి శివారుకు పిలిచారు. అలా అతన్ని పెద్దేముల్ మండలం గొట్లపల్లి గ్రామ శివారుకు తీసుకెళ్లారు. ఎవరూ లేని ప్రదేశం చూసుకొని అటాక్ చేశారు. అతని తీవ్రంగా కొట్టి పక్కనే ఉన్న బండరాయి తలపై మోది హత్య (Friend Murder) చేశారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: EMI, Mobile, Murder, Peddapalli

    తదుపరి వార్తలు