Home /News /crime /

A MAN WHO LIED TO A YOUNG WOMAN THAT HE WAS AN EX LOVER AND THREATENED WITH HER SEMI NUDE PHOTOS PRV

Crime news: మాజీ ప్రేమికుడి స్నేహితుడే ఇంత పని చేస్తాడనుకోలేదు ఆ యువతి.. ఆమెతో సాన్నిహిత్యం నటించి చివరికి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆమె అప్పటివరకు తన మాజీ ప్రియుడితోనే (Ex Boyfriend) చాటింగ్ ​చేస్తున్నానని భావించింది. అతడి కోరిక మేరకు కొన్ని ప్రైవేటు ఫొటోలు (Private photos) చాటింగ్​లో పంపింది. అయితే అటు నుంచి వచ్చిన రిప్లై చూసి ఆ యువతికి మైండ్​ బ్లాంక్​ అయింది.

ఇంకా చదవండి ...
    సోషల్ మీడియా వేదికగా యువతులతో పరిచయాలు పెంచుకుంటున్న కొందరు వ్యక్తులు ఆపై వారిని లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారు. తొలుత స్నేహంగా నటిస్తూ.. వారి వివరాలు సేకరించి ఆ తర్వాత బెదిరింపులకు పాల్పడుతున్నారు. అయితే కొందరు తెలిసిన వారి దగ్గరా మోసపోతుంటారు. ఇలాంటి ఘటనే ఒకటి తాజాగా జరిగింది. ఆమె అప్పటివరకు తన మాజీ ప్రియుడితోనే (Ex Boyfriend) చాటింగ్ ​చేస్తున్నానని భావించింది. అతడి కోరిక మేరకు కొన్ని ప్రైవేటు ఫొటోలు (Private photos) చాటింగ్​లో పంపింది. అయితే అటు నుంచి వచ్చిన రిప్లై చూసి ఆ యువతికి మైండ్​ బ్లాంక్​ అయింది. ఇంకేముంది ఆ ఫోటోలను అడ్డుపెట్టుకుని అతడు యువతిని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు.  హైదరాబాద్ (Hyderabad) శివారులోని శివరాంపల్లిలో నివాసముంటే మహ్మద్ మొహసీన్ (22) పెయింటింగ్ పనులు చేస్తుంటాడు. ఇతడి స్నేహితుడొకడు గతంలో ఓ యువతి ప్రేమించి ప్రస్తుతం దూరంగా వుంటున్నాడు. ఈ విషయం తెలిసి మొహసీన్ నీచానికి పాల్పడ్డాడు.

    యువతి పూర్తిగా నమ్మిన తర్వాత..

    స్నేహితుడి మాజీ ప్రియురాలి ఫోన్ నెంబర్ మొహసీన్ ఎలాగోలా సేకరించాడు. ఆమెకు ఫోన్ చేసి మాజీ ప్రియుడు రాజు (Ex boyfriend raju) మాట్లాడుతున్నట్లు నమ్మించాడు. తన ప్రియుడే మనసుమార్చుకుని మళ్లీ తనతో మాట్లాడుతున్నట్లు యువతి కూడా నమ్మింది. దీంతో ఇద్దరి మధ్య మాటలు కాస్తా ఆన్ లైన్ చాటింగ్ (Online chatting) వరకు చేరుకున్నాయి. యువతి పూర్తిగా నమ్మిన తర్వాత ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు పంపాలని అతడు కోరాడు. దీంతో యువతి అర్థనగ్నంగా వున్న ఫోటోలు(Photos), వీడియోలను (Videos) అతడికి పంపింది. ఇంకేముంది అనుకున్న పని పూర్తవడంతో మొహసీన్ తన అసలు రూపాన్ని బయటపెట్టాడు.

    అతడి బెదిరింపులకు భయపడకుండా..

    తానెవరో బయటపెట్టిన మొహసీన్ ఫోటోలను అడ్డం పెట్టకుని బ్లాక్ మెయిల్ (Blackmail) చేయడం ప్రారంభించాడు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించి యువతిని డబ్బులు డిమాండ్ చేసాడు. ఆమె కాళ్ళావేళ్లా పడి వేడుకున్నా ఫోటోలు డిలీట్ చేయడానికి అంగీకరించలేదు. అయితే యువతి అతడి బెదిరింపులకు భయపడకుండా షీ టీమ్స్ (She Teams) ని ఆశ్రయించింది. బాధిత యువతి ఫిర్యాదు మేరకు మొహసీన్ ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. దీంతో అతడిని మలక్ పేట పోలీస్ స్టేషన్లో అప్పగించారు. అతడిపై సెక్షన్ 385,354 ఐపిసి, 67ఏ ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసారు పోలీసులు.

    యువతితో స్నేహం నటించి..

    గతంలోనూ విశాఖపట్నం జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. యలమంచిలి మండలం పూలపర్తి గ్రామానికి చెందిన 21 ఏళ్ల భార్గవ్ ప్రైవేటు సర్వేయర్‌గా పనిచేస్తున్నాడు. ఇతను కొన్ని నెలల కిందట తకను తెలియని ఓ యువతి నెంబర్‌కు వాట్సాప్‌లో హాయ్ అంటూ మెసేజ్ చేశాడు. అటువైపు నుంచి రిప్లై రావడంతో భార్గవ్ ఆనందపడ్డాడు. దీంతో ఆమెతో చాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే ఆ యువతితో స్నేహం నటించిన భార్గవ్.. ఆమె వివరాలు సేకరించాడు. అనంతరం ఆమె ఇన్‌స్ట్రాగ్రామ్ ఖాతాను తెలుసుకుని వీడియో కాల్స్ ద్వారా మాట్లాడటం మొదలుపెట్టాడు. వీడియో కాల్స్ మాట్లాడే సమయంలో ఆమె పర్సనల్ ఫొటోలను సంపాదించాడు. అనంతరం అతని ప్లాన్ అమలు చేశాడు. నగ్నంగా కనిపించాలంటూ ఆమెపై ఒత్తిడి చేశాడు. వాటిని వీడియో తీసి తరచూ కనిపించాలంటూ వేధింపులకు గురిచేశారు. లేదంటే అశ్లీల ఫొటోలను ఆమె స్నేహితులకు, బంధువులకు పంపుతానని బెదిరింపులకు పాల్పడ్డాడు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Crime news, Hyderabad

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు