Coronavirus:లాక్‌డౌన్ వేళ ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడని.. సొంత తమ్ముడినే హత్య..

కరోనా వైరస్ నియంత్రణకు లాక్‌డౌన్ ప్రకటించిన సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లాడని ఓ వ్యక్తి సొంత తమ్ముడిని కత్తితో పొడిచి చంపాడు. ఈ విషాద ఘటన ముంబైలోని కందివాలిలో చోటుచేసుకుంది.

news18-telugu
Updated: March 27, 2020, 1:23 PM IST
Coronavirus:లాక్‌డౌన్ వేళ ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడని.. సొంత తమ్ముడినే హత్య..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్ భయానికి కొంతమంది ఎప్పడు ఏలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావట్లేదు. ఓ వ్యక్తి కరోనా సోకిందని కట్టుకున్న భార్య, కన్నకొడుకు బయటకు గెంటేసిన ఘటన మరువకముందే ముంబైలో మరో విషాద ఘటన జరిగింది. ఓ వ్యక్తి లాక్‌డౌన్ సమయంలో ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడన్న కోపంతో సొంత తమ్ముడిని కత్తితో పొడిచి హత్య చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ముంబై నగర పరిధిలోని కందివాలికి చెందిన రాజేష్ లక్ష్మి ఠాకూర్, దుర్గేష్ అన్నదమ్ములు. దుర్గేష్ పూణెలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా చేపట్టిన లాక్‌డౌన్ కారణంగా కందివాలిలోని తన ఇంటికి వచ్చాడు.

అయితే బుధవారం మధ్యాహ్నాం సమయంలో దుర్గేష్ కిరాణ సామగ్రి తేచ్చేందుకు ఇంట్లో నుంచి బయటకు వెళ్లి రాత్రి సమయంలో ఇంటికి వచ్చాడు. దీంతో దుర్గేష్‌పై లాక్‌డౌన్ సమయంలో ఇంటి నుంచి బయటకు ఎందుకు వెళ్లావని, అన్న రాజేష్‌తో పాటు అతడి భార్య అగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అన్నదమ్ములిద్దరికి వివాదం తలెత్తింది. వివాదం కాస్త కత్తిపోట్ల వరకు దారితీసింది. వివాదం నేపథ్యంలో రాజేష్ కత్తి తీసుకుని తమ్ముడు దుర్గేష్‌పై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన దుర్గేష్‌ను సమీపంలోని హాస్పిటల్‌కు తరలించగా, అప్పటికే దుర్గేష్ మృతిచెందినట్టు డాక్టర్లు తెలిపారు. ఈ మేరకు రాజేష్‌పై హత్య కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.

First published: March 27, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading