హైదరాబాద్‌లో దారుణం.. మద్యం అమ్మకాలు మొదలైన గంటకే..

లాక్‌డౌన్ సమయంలో ఎందుకు మందు కొన్నావని ప్రశ్నించడంతో తాగిన మైకంలో ఉన్న ప్రసాద్ ఏకంగా శరీరాన్ని బ్లేడుతో కోసుకోవడం మొదలుపెట్టాడు.

news18-telugu
Updated: May 6, 2020, 12:58 PM IST
హైదరాబాద్‌లో దారుణం.. మద్యం అమ్మకాలు మొదలైన గంటకే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మద్యం మహమ్మారి పచ్చని కుటుంబాల్లో పెట్టిన చిచ్చులు అన్నీఇన్నీకావు. మద్యం కారణంగా ఎన్నో వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మద్యం వల్ల ఎన్నో కాపురాలు చిన్నాభిన్నమయ్యాయి. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా గత 40రోజులుగా మద్యం అమ్మకాలు నిలిచిపోయాయి. తాజాగా బుధవారం నుంచి మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో మద్యం ప్రియుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. మద్యం దుకాణాలు తెరుస్తారనగా మద్యం కొనుగోలు ఉదయం నుంచి పెద్దఎత్తున క్యూ కట్టారు. దుకాణాల ప్రారంభానికి ముందుగానే మందుబాబులు బారులుదీరారు. గంటల కొద్దీ క్యూలైన్లలో నిలబడి చివరకు మందును చేజిక్కుంచికుని మందును ఇంటికీ తీసుకెళ్లే వారి ఆనందం అంతాఇంతా కాదు. అయితే కొంతమంది అప్పటికే పూటుగా తాగి కుటుంబ సభ్యులతో గొడవకు దిగుతున్నారు.

ఆ తరహాలోనే హైదరాబాద్ నగరంలోని బాలానగర్ కు చెందిన ప్రసాద్ అనే వ్యక్తి పూటుగా తాగి భార్యతో వాగ్వాదానికి దిగాడు. లాక్‌డౌన్ సమయంలో ఎందుకు మందు కొన్నావని ప్రశ్నించడంతో తాగిన మైకంలో ఉన్న ప్రసాద్ ఏకంగా శరీరాన్ని బ్లేడుతో కోసుకోవడం మొదలుపెట్టాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకున్నారు. భార్యభర్తల గొడవలో జోక్యం చేసుకుని సర్దుబాటు చేశారు. అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
First published: May 6, 2020, 12:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading