సొంత తమ్ముడి భార్య అని చూడకుండా.. బావ ఎంత పనిచేశాడంటే..

చిన్న ఏసన్న, పుష్ఫరాజు ఇద్దరు అన్నదమ్ములు. అయితే వీరికి ఇంటి స్థలం విషయంలో కొంతకాలం గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయమై తమ్ముడి భార్య శ్రీలేఖ(35)తో చిన్న ఏసన్న శుక్రవారం గొడవ పెట్టుకున్నాడు. మాటామాటి పెరిగింది.

news18-telugu
Updated: June 6, 2020, 1:28 PM IST
సొంత తమ్ముడి భార్య అని చూడకుండా.. బావ ఎంత పనిచేశాడంటే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఓ వ్యక్తి తన సొంత తమ్ముడి భార్య అని చూడకుండా గొడ్డలితో నరికి చంపాడు. ఈ ఘటన నందికొట్కూరులో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నందికొట్కూరు మండలం దామగట్ల గ్రామానికి చెందిన చిన్న ఏసన్న, పుష్ఫరాజు ఇద్దరు అన్నదమ్ములు. అయితే వీరికి ఇంటి స్థలం విషయంలో కొంతకాలం గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయమై తమ్ముడి భార్య శ్రీలేఖ(35)తో చిన్న ఏసన్న శుక్రవారం గొడవ పెట్టుకున్నాడు. మాటామాటి పెరిగింది. దీంతో చిన్న ఏసన్న ఆగ్రహంతో మరదలు శ్రీలేఖ మెడపై గొడ్డలితో విచక్షణ రహితంగా నరికాడు. రక్తపు మడుగులో పడి ఉన్న బాధితురాలు శ్రీలేఖను స్థానికులు 108 వాహనంలో అంబులెన్సులో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందికొట్కూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి భర్త పుష్పరాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
First published: June 6, 2020, 1:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading