A MAN WHO ATTACKED AND KILLED A CHICKEN SWORD THAT HE LOVED BN
ప్రియురాలిని పావుగా వాడి.. ప్రియుడిని అంతం చేసిన తండ్రి, సోదరుడు..
ప్రతీకాత్మక చిత్రం
ప్రేమించిన అమ్మాయినే ఎరగా వాడి ప్రియుడు దినేశ్‌ను హత్య చేసేందుకు పథకం వేశారు. దినేశ్‌కు అమ్మాయితో ఫోన్ చేయించి చీరాలలోని 216 నంబరు జాతీయ రహదారి వద్దకు పిలిపించారు.
తన చెల్లిని ప్రేమించాడనే కోపంతో ఓ వ్యక్తి మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి కోడికత్తితో పొడిచి చంపిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా చీరాల పట్టణానికి చెందిన నల్లగొండ్ల దినేశ్(21), గుంటూరు జిల్లా వెదుళ్లపల్లికి చెందిన ఓ అమ్మాయి ప్రేమించుకున్నారు. వారి ప్రేమ వ్యవహారం చాలాకాలంగానే కొనసాగుతోంది. అయితే ఈ విషయం అమ్మాయి ఇంటిలో తెలియడంతో తండ్రి, సోదరుడితో కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కూతురి ప్రేమకు ఏలాగైనా స్వస్తి చెప్పాలనేఉద్దేశంతో అమ్మాయిని బెదిరించారు. ఏవో మాయమాటలు చెప్పో.. బెదిరించో మొత్తానికైతే కూతురిని తమ దారిలోకి తెచ్చుకున్నారు. అంతటితో ఆగకుండా ఆ అమ్మాయినే ఎరగా వాడి ప్రియుడు దినేశ్‌ను హత్య చేసేందుకు పథకం వేశారు.
దినేశ్‌కు అమ్మాయితో ఫోన్ చేయించి చీరాలలోని 216 నంబరు జాతీయ రహదారి వద్దకు పిలిపించారు. పథకం ప్రకారం.. అమ్మాయి అన్న కంపా విజయ్.. తనతో పాటు వంశీ, యేసులతో కలిసి దినేశ్ వెంటపడి మరీ కోడికత్తితో గొంతులో పొడిచి అక్కడ్నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన దినేశ్ జాతీయ రహదారి పక్కనే ఉణ్న కృపానగర్లోకి పరిగెత్తాడు. ఓ ఇంటి సమీపంలో చెట్టు కింద ఉన్న కుర్చీలో కూలబడి అలాగే ప్రాణాలు వదిలాడు. ఈ విషయం స్థానికులు పోలీసులకు చేరవేడయంతో ఘటనాస్థలికి చేరుకున్నారు. స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు.
Published by:Narsimha Badhini
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.