Home /News /crime /

A MAN SHOT THE SCENE OF A SUICIDE ATTEMPT ON HIS CELL PHONE AND POSTED THE VIDEO TO HIS FRIENDS IN ASIFABAD ADB PRV

Suicide video: గొంతు కోసుకుని యువకుడి ఆత్మహత్యాయత్నం.. వీడియో తీసి మరీ స్నేహితులకు పోస్టుచేసిన యువకుడు

 (ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

గొంతుకోసుకొని ఆత్మహత్యా యత్నం చేయడమే కాకుండా గొంతుకోసుకుంటున్న దృశ్యాన్ని సెల్ ఫోన్ లో చిత్రీకరించి ఆ వీడియోను స్నేహితుడికి పోస్టు చేసిన ఘటన కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగింది.

    (కట్టా లెనిన్, న్యూస్ 18 ఆదిలాబాద్ ప్రతినిధి)

    కన్ను తెరిస్తే జననం.. కన్ను మూస్తే మరణం… కను రెప్పపాటే జీవితం. అయితే జీవితంలో సమస్యలు (Life problems) అందరికీ వస్తాయి. పట్టుదలతో పోరాడే వాడే మనిషి.  చాలామంది ఏదో ఒకటి సాధించి వారి పేర్లు చిరస్థాయిగా చరిత్రలో లిఖించుకుంటున్నారు.  అలాంటి జీవితాలను ఏ మాత్రం లెక్కచేయకుండా, ప్రాణాలంటే భయం లేకుండా ఇటీవల కాలంలో చాలామంది బలవన్మరణాలకు 9Suicides) పాల్పడటం పరిపాటిగా మారిపోయింది. మరోవైపు అమ్మ తిట్టిందనో.. నాన్న కొట్టాడనో… లేక ఇంట్లో పెద్దలు మందలించారనో.. అదికాకపోతే నచ్చింది కొని ఇవ్వలేదనో, అడిగింది తెచ్చి ఇవ్వలేదనో అలిగి విద్యార్థులు, యువకులు ప్రాణాలు తీసుకుంటున్న సంఘటనలు చూస్తున్నాం. తాజాగా ఓ యువకుడు (Young boy) ఏకంగా గొంతుకోసుకొని ఆత్మహత్యకు (Suicide) పాల్పడమే కాకుండా ఆ దృశ్యాన్ని తన సెల్ ఫోన్ ద్వారా చిత్రికరించి (Suicide Video) తన స్నేహితుడి మొబైల్​కు పంపించిన ఘటన కొమురంభీం ఆసిఫాబాద్ (KomaramBheem Asifabad) జిల్లాలో చోటుచేసుకుంది.

    కొన్ని క్షణాల్లోనే..

    కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలానికి చెందిన పెందూర్ అఖిల్ (Akhil) అనే యువకుడు జిల్లా కేంద్రంలో డిగ్రీ రెండవ సంవత్సరం (Degree second year boy) చదువుతున్నాడు. అయితే శుక్రవారం బ్లేడుతో గొంతు కోసుకొని ఆత్మహత్యకు (Suicide) యత్నించారు. తాను గొంతుకోసుకుంటున్న దృశ్యాలను సెల్ ఫోన్ ద్వారా చిత్రీకరించి తన స్నేహితులకు మొబైల్ లో షేర్ చేశాడు (Shared to hi Friends).  కొన్ని క్షణాల్లోనే ఆ యువకుడి స్నేహితులు (Friend) పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పది నిముషాల్లోనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్ళిన ఆ యువకుడిని వాంకిడి ఎస్.ఐ. దీకొండ రమేష్ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువకుడు వైద్యుల (Doctors) పర్యవేక్షణలో చికిత్స పొందుతూ ఉన్నాడు. అయితే ఆ యువకుడు ఎందుకు ఆత్మహత్యకు ప్రయత్నం చేశాడన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ ప్రేమ వ్యవహారం ఏమైన ఈ ఘటనకు కారణమై ఉండవచ్చన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

    ఇదిలా ఉంటే అదే జిల్లాకు చెందిన ఓ యువకుడు యువతి తన ప్రేమను నిరాకరించిందని మనస్తాపం చెంది ఆత్మహత్మకు పాల్పడ్డాడు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం మాణిక్యాపూర్ గ్రామానికి చెందిన తుమరం నవీన్ అదే గ్రామానికి చెందిన యువతి కొంతకాలంగా ప్రేమించుకున్నారు. కాగా ఆ యువతితో నవీన్ మాట్లాడేందుకు ప్రయత్నించగా అందుకు ఆమె నిరాకరించింది. దీంతో తన ప్రేమను నిరాకరించిందని మనస్తాపం చెంది ఇంటికి వెళ్ళలేదు. మరుసటి రోజు గ్రామస్థుల సమీప అటవీ ప్రాంతంలో గాలించగా ఓ చెట్టుకు ఉరివేసుకొని కనిపించాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Adilabad, Asifabad, Attemp to suicide, Crime news, Selfie video suicide

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు