Shooting At Ames Cornerstone Church: అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా ఏమ్స్‌లోని కార్నర్‌స్టోన్ చర్చి బయట గురువారం రాత్రి తుపాకుల మోత మోగింది. కార్నర్‌స్టోన్ చర్చి బయట ఆగంతుకుడు జరిపిన దాడిలో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మహిళలపై కాల్పులు జరిపిన అనంతరం దుండగుడు తనను తాను కాల్చుకొని చనిపోయాడు. ఘటనాస్థలిలో ఇద్దరు మహిళల మృతదేహాలు సహా దుండగుడి మృతదేహాన్ని సైతం గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. కాల్పులకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో ఎలాంటి ముప్పులేదని స్పష్టం చేశారు.
అంతకుముందు,ఓక్లహామాలోని తుల్సా నగరంలో ఉన్న సెయింట్ ఫ్రాన్సిస్ దవాఖాన ప్రాంగణంలో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. అయితే కాల్పుల తర్వాత తనను తాను కాల్చుకుని అక్కడికక్కడే మృతి చెందాడు. ఆర్థోపెడిక్ సర్జన్ కోసం దుండగుడు ఆస్పత్రికి వెళ్లాడు. అయితే అక్కడ వైద్యుడు కనిపించకపోవడంతో విచక్షణారాహిత్యంగా కాల్పులు జరిపాడు. దీంతో భయాందోళనకు గురైన వైద్య సిబ్బంది వెంటనే రోగులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ALSO READ Punjab Govt : సిద్ధూ హత్యతో దిగొచ్చిన ఆప్ సర్కార్..వారందరికీ భద్రత పునరుద్దరణ
అమెరికాలో జరుగుతున్న వరుస కాల్పుల్లో వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రక్తపాతాన్ని నివారించడానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొన్ని కీలక నిర్ణయాలను ప్రకటించారు. ఏకే 47, ఏకే 15 సహా.. తొమ్మిది రకాల వెపన్స్‌ను నిషేధించేలా చట్టాన్ని తెస్తామని చెప్పారు. అమెరికాలో ప్రస్తుతం 18 సంవత్సరాలు నిండిన వారెవరైనా తుపాకులను కొనుగోలు చేయవచ్చు అయితే ఈ వయస్సు నిబంధనను సవరించనున్నట్లు జో బైడెన్ తెలిపారు. ఇకపై 21 సంవత్సరాలు నిండిన వారు మాత్రమే గన్స్ కొనుగోలు చేయగలరని అన్నారు. దీనిపై చట్టాన్ని తీసుకుని రావాలని ఆయన యూఎస్ కాంగ్రెస్‌ను కోరారు. హైకెపాసిటీ మేగజైన్స్‌లో 30 రౌండ్ల వరకు కాల్పులు జరిపేలా బుల్లెట్స్‌ను నింపవచ్చని, వాటిని కూడా నియంత్రించాలని సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Joe Biden, Us shooting, USA