ఫోన్ రిప్లేస్ చేయలేదని షాపు ముందే నిప్పంటించుకున్న వ్యక్తి... ఢిల్లీలో దారుణం

కొద్దిరోజుల క్రితం తన మేనకోడలు ఆన్లైన్ క్లాసుల కోసం ఒక మొబైల్ కొన్నాడు. దాని పనితీరు సరిగ్గా లేదు. ఎన్నిసార్లు తిరిగినా సర్వీస్ సెంటర్ వాళ్లు పట్టించుకోలేదు. దాంతో ఆ వ్యక్తి...!

news18
Updated: November 15, 2020, 6:07 AM IST
ఫోన్ రిప్లేస్ చేయలేదని షాపు ముందే నిప్పంటించుకున్న వ్యక్తి... ఢిల్లీలో దారుణం
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: November 15, 2020, 6:07 AM IST
  • Share this:
కోడలికి ఆన్లైన్ క్లాసులు నడుస్తుండటంతో.. వాటిని చూడటానికి గానూ కొద్ది రోజుల క్రితం ఒక వ్యక్తి టచ్ స్క్రీన్ ఫోన్ కొన్నాడు. వారం రోజుల తర్వాత ఆ ఫోన్.. పదే పదే వేడెక్కడం ప్రారంభించింది. ఛార్జింగ్ వెంటనే అయిపోతుంది. ఇదేంటి... ఇలా అవుతుందని సదరు వ్యక్తి దానిని సర్వీసింగ్ సెంటర్ కు తీసుకెళ్లాడు. విషయం వారితో చెప్పాక.. వాళ్లు ఏదో రిపేర్ చేసి పంపించారు. కానీ మళ్లీ అదే సమస్య. పలుమార్లు సర్వీస్ సెంటర్ కు వెళ్లిన ఆ వ్యక్తి.. శుక్రవారం సదరు మొబైల్ సేవా కేంద్రానికి వెళ్లి.. తనకు కొత్త ఫోన్ ఇవ్వాలని కోరగా దానికి వాళ్లు ఒప్పుకోలేదు. దీంతో మనస్థాపం చెందిన అతడు.. షాపు ముందే పెట్రోల్ పోసుకున్నాడు.

వివరాల్లోకెళ్తే.. ఢిల్లీలో గత శుక్రవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి. ఢిల్లీకి సమీపంలోని ప్రహ్లాద్ పూర్ గ్రామానికి చెందిన భీమ్ సింగ్.. కొద్దిరోజుల క్రితమే తన కోడలి కోసం ఒక ఫోన్ కొన్నాడు. ఆన్లైన్ క్లాసులు జరుగుతుండటంతో ఆ చిన్నారికి పాఠాలు వినడానికని దానిని తీసుకున్నాడు. వారం రోజుల దాకా ఆ ఫోన్ బాగానే పని చేసింది. కానీ తర్వాతే అసలు సమస్య ప్రారంభమైంది. ఉన్నట్టుండి ఫోన్ వేడెక్కడం.. ఎంతసేపు ఛార్జింగ్ పెట్టినా కొద్దిసేపు కూడా రాకపోవడం.. తరుచూ స్విచ్ ఆఫ్ అవుతుండటం వంటివి అయ్యేవి. దీంతో భీమ్ సింగ్.. ఫోన్ ను సర్వీస్ సెంటర్ కు తీసుకెళ్లాడు.

సేవా కేంద్రం వాళ్లకు ఫోన్ గురించి చెప్పగా.. వాళ్లు ఏదో రిపేర్ చేసి ఇచ్చారు. కానీ ఇంటికొచ్చినాక మళ్లీ అదే సమస్య. ఒకసారి ఫోన్ బ్యాటరీ కూడా పేలింది. దీంతో భీమ్ సింగ్.. సర్వీస్ సెంటర్ కు వెళ్లి.. తనకు కొత్త ఫోన్ ఇవ్వాలని అడిగాడు. వాళ్లు రిప్లేస్ చేయడం కుదరదని... కావాలంటే రిపేర్ చేస్తామే తప్ప కొత్తది ఇవ్వడం కుదరదని కరాఖండిగా చెప్పారు. పలుమార్లు ఇలా వెళ్లొచ్చిన భీమ్ సింగ్.. చివరికి శుక్రవారం తాడో పేడో తేల్చుకుందామని సర్వీస్ సెంటర్ కు వెళ్లాడు.

అక్కడ వారిని రిప్లేస్ చేయమని ఎంత బతిమిలాడినా వాళ్లు వినలేదు. దీంతో మనస్థాపానికి గురైన భీమ్ సింగ్... సదరు సంస్థ బయటకు వచ్చి పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు. ఒక్కసారిగా మంటలు అతడి శరీరాన్ని చుట్టేశాయి. కాలుతున్న వేడిని తట్టుకోలేక భీమ్ సింగ్ హాహాకారాలు చేస్తున్నాడు. ఇది చూసిన అక్కడివారికి ఏమవుతుందో అర్థం కాలేదు. పలువురు అక్కడే ఉన్న షాపులలోంచి నీటిని తీసుకొచ్చి భీమ్ సింగ్ ఒంటిమీద మంటలను ఆర్పారు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగానే ఉన్నట్టు తెలుస్తుంది. కాగా, ఈ ఘటనపై భీమ్ సింగ్ భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Published by: Srinivas Munigala
First published: November 15, 2020, 6:07 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading