రేప్ చేసి, ఆమె బట్టలు ఎత్తుకెళ్లాడు... పబ్లిక్ పార్కులో నగ్నంగా యువతి...

ఐడీకార్డులు చూపించాలని కోరుతూ ప్రేమజంటను అడ్డుకున్న వ్యక్తి... ప్రియుడు ఐడీకార్డు తేవడానికి వెళ్లిన సమయంలో యువతిపై అత్యాచారం... ఆపై ఆమె బట్టలు తీసుకుని పరార్... ఏం చేయాలో తెలియక నగ్నంగా రోడ్డు మీదకి వచ్చిన యువతి...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 20, 2019, 5:37 PM IST
రేప్ చేసి, ఆమె బట్టలు ఎత్తుకెళ్లాడు... పబ్లిక్ పార్కులో నగ్నంగా యువతి...
నమూనా చిత్రం
  • Share this:
దుబాయ్‌లో ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఓ వ్యక్తి... తర్వాత ఆమె బట్టలు ఎత్తుకుని పారిపోయాడు. దాంతో ఏం చేయాలో తెలియక అలాగే రోడ్డు మీదకి వచ్చిందా యువతి. ఆమెను చూసి అందరూ షాక్‌కు గురైన... పరిస్థితి తెలిసి జాలి పడ్డారు. దుబాయ్‌లోని ఓ పార్కులో నడుచుకుంటూ వెళ్తున్నారు ఇద్దరు ప్రేమికులు. వారికి ఎదురుగా వచ్చిన ఓ వ్యక్తి... ప్రేమికులను ఆపి మీరు వరుసకు ఏమవుతారని ప్రశ్నించాడు. దానికి ఆ యువతి... తామిద్దరం ప్రేమించుకుంటున్నామని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని చెప్పింది. ఆ సమాధానంతో సంతృప్తి చెందని అతను... పెళ్లిచేసుకోకుండా ఇలా బయట తిరగడం దుబాయ్‌లో చాలా పెద్ద నేరం అంటూ బెదిరించాడు. దాంతో ఆగ్రహానికి లోనైన ఆ ప్రేమజంట... మమ్మల్ని నిలదీయడానికి మీరెవ్వరంటూ పశ్నించాడు.

దానికి అతను ఇక్కడి మున్సిపల్ ఆఫీసర్‌నంటూ ఐడీ కార్డు చూపించాడు. మీ ఐడీకార్డులు చూపించాలని ఆదేశించాడు. దాంతో తన ఐడీ కార్డు గదిలో ఉందని చెప్పిన అతను, తీసుకురావడానికి వెళ్లాడు. ఇంతలో ఒంటరిగా ఉన్న యువతిని... మాటల్లో పెట్టి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన అతను, ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆమె బట్టలు తీసుకుని వెళ్లిపోయాడు. దాంతో నగ్నంగా ఉన్న ఆమెకు ఏం చేయాలో తెలియలేదు. చాలాసేపు ప్రియుడి కోసం వేచిచూసిన ఆమె, అతను రాకపోవడంతో అలాగే రోడ్డు మీదకి వచ్చింది. నగ్నంగా నిల్చున్న మహిళను షాక్‌కు గురైన స్థానికులు... ఆమె పరిస్థితి తెలుసుకుని జాలి చూపించారు. అక్కడికి వచ్చిన ఆమె ప్రియుడు.... కారులో యువతిని ఎక్కించుకుని తీసుకెళ్లాడు. యువతి ఫిర్యాదుతో కేసు నమోదుచేసుకున్న పోలీసులు... సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితుడి కోసం గాలించి, పట్టుకున్నారు. సదరు వ్యక్తి పార్క్‌లో పనిచేసే ఓ చిరుద్యోగి అని తేలడం కొసమెరుపు.
First published: March 20, 2019, 5:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading