Home /News /crime /

A MAN RAPED A MINOR GIRL AND THEN HAD AN ABORTION AFTER GETTING PREGNANT AND PAID RS 30000 IN KARIMNAGAR KNR PRV

Minor girl raped: కూతురు వయసున్న బాలికపై ఓ కామాంధుడి అఘాయిత్యం.. ఆపై బాలిక శీలానికి రూ. 30,000 వెల

నర్సింగాపూర్​

నర్సింగాపూర్​

ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. ఇంటి పక్కన .. తెలిసిన వారు కూడా ఏమాత్రం అదును దొరికిన అత్యాచారాలకు పాల్పడుతున్నారు . ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తల్లో నిలిచింది .

  (Srinivas. P , News 18, Karimnagar)

  సమాజంలో మహిళల (woman) భద్రత ప్రస్తుతం పెనుసవాల్ గా మారింది . కామాంధులు పసిపిల్లల నుంచి పండు ముసలి వరకు ఎవరిని వదలడం లేదు . ప్రభుత్వాలు దిశ , నిర్భయ చట్టాలు తీసుకొచ్చిన ఈ నీచులలో ఏమాత్రం మార్పు రావడం లేదు . కేవలం క్షణికమైన సుఖం కోసం పశువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు . కొందరు మరీ దారుణంగా ప్రవర్తిస్తున్నారు. గుడి , బడి , బస్టాండ్ , ఆఫీస్ , ఇలా మహిళ వేధింపులకు గురవ్వని చోటు ఉందా .. అంటే లేదని సమాధానం వస్తుంది . కేవలం అమ్మ కడుపులో ఉన్న తొమ్మిది నెలల మాత్రమే బాలికలకు రక్షణ ఉంది . కొన్ని చోట్ల కన్నతండ్రి , అన్న .. తమ వారిపై అఘాయిత్యాలకు (Girl raped) పాల్పడిన సంఘటనలు వార్తలలో నిలిచాయి . ఇంటి పక్కన .. తెలిసిన వారు కూడా ఏమాత్రం అదును దొరికిన అత్యాచారాలకు (Rapes) పాల్పడుతున్నారు . ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తల్లో నిలిచింది .

  పెద్ద మనుషుల సమక్షంలో..

  కూతురు వయస్సు ఉన్న మైనర్ బాలిక ( 13 ) పై అఘాయిత్యానికి (Minor girl raped) పాల్పడ్డాడు ఓ కామాంధుడు. అమ్మాయి గర్భం (Pregnant) దాల్చడంతో  అబార్షన్ చేయించి , బాలిక కుటుంబానికి  పెద్ద మనుషుల సమక్షంలో పరిహారంగా రూ .30 వేలు అప్పజెప్పాడని ప్రచారం జరుగుతోంది. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్​ (Karimnagar) చందుర్తి మండలం నర్సింగాపూర్ (Narsingapur) గ్రామానికి చెందిన మైనర్ బాలికతో అదే గ్రామానికి చెందిన 45 సంవత్సరాల వ్యక్తి  లైంగికదాడికి పాలడ్డాడు . దీంతో బాలిక గర్భం దాల్చింది .

  నాలుగు నెలలు గర్భిణీ కావడంతో బాలిక కుటుంబ సభ్యులు వేములవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఐదు రోజుల క్రితం అబార్షన్ చేయించినట్లు ప్రచారంలో ఉంది . కాగా బాలిక కుటుంబానికి సదరు ప్రబుద్ధుడు రూ .30 వేలు పరిహారంగా చెల్లించినట్లు తెలిసింది . ప్రబుద్ధున్ని కాపాడేందుకు ఉరి పెద్ద మనషులు సహకరిస్తున్నారనేది ప్రచారం జరుగుతుంది . కాగా ఈ విషయంపై చందుర్తి ఎస్సై శ్రీకాంత్​ను వివరణ కోరగా తమ దృష్టికి రాలేదన్నారు.

  తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు చాలాగా వెలుగుచూశాయి. ఇంతకుమందు పదిహేనేళ్ల బాలిక శీలానికి వెల కట్టిన హేయమైన సంఘటన అనంతపురంలో జరిగింది. తల్లిదండ్రులు లేని అమ్మాయిని మాయమాటలతో మోసం చేసి, ఐదు రోజుల పాటు తిప్పుకుని ఆ తరువాత ఇంటి దగ్గర వదిలివెళ్లాడో ప్రబుద్ధుడు. దీనిమీద బంధువులు పోలీస్ స్టేషన్ కు వెడితే రూ. 30 వేలు ఇప్పిస్తానని రాజీ కుదిర్చాడో రాజకీయనాయకుడు.  శివాజీనగర్‌లో తల్లిదండ్రులు లేని 15 ఏళ్ల బాలికను అదే ప్రాంతానికి చెందిన హరీష్‌ (30)అనే యువకుడు మాయమాటలతో తీసుకెళ్లిపోయాడు.

  దీంతో 20వ తేదీన బంధువులు ఆ బాలిక తప్పిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తరువాత హరీష్‌ ఆ బాలికను కొన్నిరోజుల పాటు ఎక్కడెక్కడో తిప్పి మదనపల్లె బస్టాండు వద్ద వదలి వెళ్లిపోయాడు. ఇంటికి చేరిన బాలిక జరిగిన విషయాలు చెప్పడంతో ఆ బాలిక బంధువులు, సోదరి టూటౌన్‌ పోలీసులకు తెలిపారు. బాలికను కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లి జీవితాన్ని నాశనం చేశాడని, న్యాయం చేయాలని కోరారు. ఈ క్రమంలో ఓ పార్టీ నేత వీరి వద్దకు వచ్చి జరిగిందేదో జరిగిపోయింది.. రూ.30వేలు ఇప్పిస్తా కేసు వాపస్ తీసుకో అంటూ బాలిక శీలానికి వెలకట్టి, రాజీ‘బేరం’చేశారు
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Crime news, Karimangar, Minor girl raped

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు