Wife and Husband: భార్యాభర్తల మధ్య ఇదెక్కడి గొడవ.. భర్త బయటకు వెళ్లి ఇంటికొచ్చేసరికి...

అంజు (ఫైల్ ఫొటో)

మోనూ రాజ్‌పుత్, అంజు(30) భార్యాభర్తలు. వీళ్లతో పాటు మోనూ తల్లి కూడా ఆ ఇంట్లోనే ఉండేది. మూడేళ్ల క్రితం మోనూ, అంజు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన మరుసటి రోజు నుంచే ఈ భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. నిత్యం గొడవలు పడుతుండేవారు.

  • Share this:
    లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో దారుణం వెలుగుచూసింది. భార్య వంట చేయలేదన్న ఒకేఒక్క కారణంతో ఆమెను భర్త హతమార్చిన ఘటన కలకలం రేపింది. అంతేకాదు.. భార్యను చంపి.. ఆమె మృతదేహాన్ని బెడ్ కింద దాచేసి ఆ భర్త ఏమీ ఎరుగనట్టు బయటకు వెళ్లిపోయాడు. రెండు రోజుల తర్వాత ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు అనుమానమొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకొచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోనూ రాజ్‌పుత్, అంజు(30) భార్యాభర్తలు. వీళ్లతో పాటు మోనూ తల్లి కూడా ఆ ఇంట్లోనే ఉండేది. మూడేళ్ల క్రితం మోనూ, అంజు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన మరుసటి రోజు నుంచే ఈ భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. నిత్యం గొడవలు పడుతుండేవారు. మోనూ ఆమెపై చేయి చేసుకునేంత వరకూ పరిస్థితి వెళ్లడంతో అంజు భర్తపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. పోలీసులు భార్యాభర్తలిద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపారు. అప్పటి నుంచి కలిసి అన్యోన్యంగానే ఉన్న మోనూ, అంజు మధ్య ఇటీవల మరోసారి గొడవ తలెత్తింది. వంట చేయమని భార్య అంజును మోనూ కోరాడు.

    నీకూ, మీ అమ్మకు నేను వండిపెట్టలేనని అంజు తెగేసి చెప్పడంతో మోనూ కోపంతో రగిలిపోయాడు. భార్యను క్షణికావేశంలో చెప్పుతో కొట్టాడు. అంతటితో ఆగక.. ఆమెను తిట్టి కొట్టి చివరకు దాడి చేసి చంపేశాడు. ఆ తర్వాత ఏం తెలియనట్టు భార్య మృతదేహాన్ని బెడ్ బాక్స్‌లో దాచేసి పని మీద అయోధ్యకు వెళ్లాడు.

    ఇది కూడా చదవండి: Transgender: ఈ హిజ్రా చేసిన పాపానికి ఆ దేవుడు కూడా క్షమించడు.. ఎంత దారుణమైన పని చేసిందంటే..

    దాదాపు మూడు రోజులుగా అంజు కనిపించకపోవడంతో ఇరుగుపొరుగు వారికి అనుమానమొచ్చింది. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో ఆ అనుమానం మరింత బలపడింది. దీంతో.. పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. ఆ ఇంటిని పరిశీలించిన పోలీసులు అంజు మృతదేహాన్ని గుర్తించారు. ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు నిందితుడైన మోనూను అరెస్ట్ చేశారు. విచారణ కొనసాగుతోందని, అంజు హత్య వెనుక అసలు కారణమేంటో త్వరలోనే తెలుస్తుందని పోలీసులు తెలిపారు.
    Published by:Sambasiva Reddy
    First published: