హోమ్ /వార్తలు /క్రైమ్ /

భార్యకు వరుస అబార్షన్‌లు.. తాంత్రికుడు చెప్పాడని బాలికను చంపి.. కళ్లు పీకేసి రక్తంతో క్షుద్రపూజలు

భార్యకు వరుస అబార్షన్‌లు.. తాంత్రికుడు చెప్పాడని బాలికను చంపి.. కళ్లు పీకేసి రక్తంతో క్షుద్రపూజలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పదేళ్ల బాలిక రక్తం, కళ్లతో క్షుద్రపూజలు చేస్తే.. మీ సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పాడు. మీ భార్య గర్భం నిలిచి.. పండంటి బిడ్డకు జన్మనిస్తుందని తెలిపాడు. అతడి మాటలను గుడ్డిగా నమ్మిన దిలీప్ కుమార్.. తన స్నేహితుల సాయంతో ఓ పదేళ్ల బాలికను కిడ్నాప్ చేసి చంపేశారు.

ఇంకా చదవండి ...

పక్క ఊరికి వెళ్లినంత ఈజీగా అంతరిక్షానికి వెళ్తున్న రోజులివి. చంద్రుడితో పాటు ఇతర గ్రహాలపైకి రాకెట్లు పంపుతున్న టెక్నలజీ యుగమిది. ఐనా మూఢ నమ్మకాలు మాత్రం ఆగడం లేదు. మారుమూల ప్రాంతాలే కాదు.. ఉన్నత విద్యావంతులున్న పట్టణాలు, నగరాల్లోనూ అంధ విశ్వాసాలు అరాచకం సృష్టిస్తున్నాయి. కుద్రపూజల పేరిట మనుషులను చంపేస్తున్న ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా బీహార్‌లోనూ ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. భర్తకు వరుసగా అబార్షన్‌లు అవుతున్నాయని.. తాంత్రికుడి సలహాల మేరకు ఓ మైనర్ బాలికను బలిచ్చాడో వ్యక్తి. ఆమె కళ్లు పీకేసి.. రక్తంతో క్షుద్రపూజలు చేాడు. ముంగేర్ జిల్లా ఈ ఘోరం జరిగింది.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ముంగేర్ జిల్లాకు చెందిన దిలీప్‌కు కుమార్‌కు ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇప్పటి వరకు సంతానం కలగలేదు. ఆయన భార్య పలుమార్లు గర్భం దాల్చినా అది నిలవలేదు. వరుసగా అబార్షన్‌లు జరుగుతున్నాయి. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ప్రయోజనం లేకపోయింది. చివరకు మిత్రుల సలహాతో ఓ తాంత్రికుడిని ఆశ్రయించాడు దిలీప్. కొన్ని రోజుల క్రింత పర్వేజ్ ఆలమ్‌ అనే తాంత్రికుడిని కలిశాడు. పదేళ్ల బాలిక రక్తం, కళ్లతో క్షుద్రపూజలు చేస్తే.. మీ సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పాడు. మీ భార్య గర్భం నిలిచి.. పండంటి బిడ్డకు జన్మనిస్తుందని తెలిపాడు. అతడి మాటలను గుడ్డిగా నమ్మిన దిలీప్ కుమార్.. తన స్నేహితుల సాయంతో ఓ పదేళ్ల బాలికను కిడ్నాప్ చేసి చంపేశారు. ఆమె కళ్లు, రక్తం సేకరించి.. క్షుద్రపూజలు చేశారు.

ఇలా బయటపడింది?

ఆగస్టు 4న ఆ బాలిక వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్న తన తండ్రికి భోజనం ఇచ్చేందుకు వెళ్లింది. కానీ తిరిగి ఇంటికి రాలేదు. చుట్టుపక్కలంతా వెతికారు. ఎక్కడా కనిపించలేదు. కీడు శంకించిన తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ బాలిక కోసం గాలించారు. కానీ ఎక్కడా ఆచూకీ లభించలేదు. మరుసటి రోజు ఉదయం అదే గ్రామంలోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో చిన్నారి మృతదేహం కనిపించింది. బాలిక శరీరంపై అక్కడక్కడా తీవ్రమైన గాయాలు ఉన్నాయి. పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా దిలీప్ కుమార్ వ్యవహారం బయటపడింది. అతడి అరెస్ట్ చేసి తమ దైన స్టైల్లో విచారించారు. అప్పుడు నేరాన్ని అంగీకరించింది జరిగిన విషయాన్ని చెప్పాడు. దిలీప్ ఇచ్చిన సమాచారంతో పర్వేజ్ ఆలమ్‌తో పాటు తన్వీర్ ఆలమ్, దశరథ్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. ఐతే నరబలి కారణంగా తమ కూతురిని అరెస్ట్ చేయలేదని.. అత్యాచారం చేసి, హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి:

పెళ్లైనా ప్రియుడిని మర్చిపోలేదు.. చూడాలని ఉందంటూ ఫోన్‌ చేసింది.. అతడు వచ్చాడు.. చంపేశాడు..

ఆమె ముగ్గురు పిల్లల తల్లి..భర్తను కాదని మరో యువకుడితో రాసలీలలు..అతడి కోసం ఏం చేసిందంటే..

First published:

Tags: Bihar, Crime news

ఉత్తమ కథలు