పదివేల కోసం.. భార్యను బేరం పెట్టిన తాగుబోతు భర్త

తాగుడుకు అలవాటుపడ్డ ఓ భర్త.. సమాజం ఛీ కొట్టే పనికి ఒడిగట్టాడు. ఏకంగా తన భార్య శీలాన్నే భేరం పెట్టాడు.

news18
Updated: October 3, 2020, 2:56 PM IST
పదివేల కోసం.. భార్యను బేరం పెట్టిన తాగుబోతు భర్త
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: October 3, 2020, 2:56 PM IST
  • Share this:
సమాజపు విలువలు నానాటికీ అంతరించుపోతున్నాయనేదానికి ఈ ఘటనే నిదర్శనం. తాగుడుకు అలవాటు పడ్డ ఒక తాగుబోతు భర్త.. ఏకంగా తన భార్య శీలాన్నే భేరంగా పెట్టాడు. తన ప్రెండ్ దగ్గర రూ. 10 వేల కు ఆశపడి ఏకంగా ఆమెను రేప్ చేయడానికి అనుమతినిచ్చాడు. సభ్య సమాజం ఛీ కొట్టే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు కింది విధంగా ఉన్నాయి.

సెప్టెంబర్ 30న ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ పోలీసులకు ఒక విచిత్రమైన కేసు వచ్చింది. రుద్రప్రయాగకు చెందిన ఒక 22 ఏండ్ల యువతి వారి దగ్గరకు వచ్చి.. ‘నన్ను రేప్ చేయడానికి నా భర్త తన మిత్రుడి దగ్గర పదివేల రూపాయలు తీసుకున్నాడు’అని ఫిర్యాదు చేసింది. అంతే.. అవాక్కవడం పోలీసుల వంతైంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ అఘాయిత్యంపై ఆమె ఇంకా చెబుతూ.. ఆమె భర్త రోజూ తాగి ఇంటికి వచ్చేవాడు. ఇదే విషయమై కొద్దిరోజులుగా వారిరువురి మధ్య గొడవలవుతున్నాయి. ఎప్పటిలాగే సెప్టెంబర్ 22 న కూడా ఆ యువతి భర్త ఫుల్లుగా తాగి వచ్చాడు. అయితే ఈసారి అతడు తన ఫ్రెండ్ ను కూడా వెంటబెట్టుకున్నాడు. తాగిన మత్తులో ఉన్న ఆ భర్తకు నిద్ర మత్తు ఆవహించగానే.. అతడి ఫ్రెండ్ ఆమెపై అసభ్యంగా ప్రవర్తించడం చేశాడు. ముందు ఈ దుశ్చర్యలకు ప్రతిఘటించిన ఆమె.. తర్వాత అతడి బలం ముందు ఎదుర్కోలేకపోయింది. దీంతో ఆ దుండగుడు.. ఆమెను రేప్ చేశాడు.

అయితే వచ్చిన పని ముగించుకుని వెళ్లే సమయంలో ఆ రేప్ చేసిన వ్యక్తి.. ఆమెకు అసలు విషయం చెప్పాడు. అంతే.. ఈ వార్త విన్న ఆమె గుండెలవిసేలా భోరున ఏడిచింది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె భర్తను పట్టుకొచ్చి అరెస్టు చేశారు. అయితే ఆ మహిళపై అత్యాచారం చేసిన నిందితుడు మాత్రం పరారీలో ఉన్నాడు. పోలీసులు ప్రస్తుతం అతడి కోసం గాలిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. హిమాలయాల అంచున ఉన్న ఉత్తరాఖండ్ లోనూ మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. గురువారం హల్ధ్వానీకి చెందిన 13 ఏండ్ల బాలికపై ఒక వ్యక్తి రేప్ చేశాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుడిని శుక్రవారం నైనిటాల్ జిల్లాలో పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు.
Published by: Srinivas Munigala
First published: October 3, 2020, 2:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading