తూర్పుగోదావరి జిల్లాలో దారుణం : ఆమెను కొబ్బరితోటకు తీసుకెళ్లి..

మహితతకు మహేష్ రూ.2 లక్షల వరకు ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఇటీవల మహిత తనను దూరం పెట్టడంపై మహేష్ తీవ్రంగా నొచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం స్నేహితులతో కలిసి యలమంచిలికి వచ్చిన మహేష్.. మహితను వెంటబెట్టుకుని కొబ్బరి తోటకు వెళ్లాడు

news18-telugu
Updated: April 29, 2019, 10:54 AM IST
తూర్పుగోదావరి జిల్లాలో దారుణం : ఆమెను కొబ్బరితోటకు తీసుకెళ్లి..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 29, 2019, 10:54 AM IST
తూర్పు గోదావరి జిల్లా యలమంచిలి మండలం కాజగొప్పులో దారుణం జరిగింది. ఓ యువతిని ప్రేమోన్మాది కొబ్బరితోటలో నరికి హత్య చేశాడు. మృతురాలిని మహితగా, హంతకుడిని మహేష్‌గా గుర్తించారు. వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు దారితీసి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. భీమవరం మండలం బేతపూడికి చెందిన మహిత కాకినాడలో ఇంటర్ వరకు చదివింది. గత నాలుగు నెలలుగా చెరువు గట్టు ప్రాంతంలోని మేనమామ ఇంట్లో నివాసం ఉంటోంది. ఇదే క్రమంలో నెల రోజుల క్రితం మహేష్ అనే ఓ ప్రైవేట్ కాలేజీ డ్రైవర్ ఆ ప్రాంతానికి వచ్చాడు.ఆ సమయంలో మహితతో మహేష్‌కు పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య పరిచయం మరింత సాన్నిహిత్యానికి దారి తీసినట్టు సమాచారం. మహితతకు మహేష్ రూ.2 లక్షల వరకు ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఇటీవల మహిత తనను దూరం పెట్టడంపై మహేష్ తీవ్రంగా నొచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం స్నేహితులతో కలిసి యలమంచిలికి వచ్చిన మహేష్.. మహితను వెంటబెట్టుకుని కొబ్బరి తోటకు వెళ్లాడు

అక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ మాటా మాటా పెరిగి ఇద్దరి మధ్య వాగ్వాదం ముదిరింది. చివరకు వెంట తెచ్చుకున్న కత్తితో మహితపై విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు. కాగా, మహేష్‌కు ఇదివరకే వివాహమైనట్టు సమాచారం. అయితే కొన్నాళ్లుగా భార్యకు దూరంగా ఉంటున్న అతను.. ఈ క్రమంలో మహితకు దగ్గరైనట్టు తెలుస్తోంది. అయితే మహితను హత్య చేయాల్సిన అవసరం మహేష్‌కు ఏముంటుంది.. అంత దారుణంగా ఎందుకు హత్య చేశాడన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.



First published: April 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...