హోమ్ /వార్తలు /క్రైమ్ /

Sad: తండ్రి ఒడిలోని పిల్లాడు గుక్క పట్టి ఏడుస్తున్నాడు.. కాసేపటికి ఏడుపు ఆగిపోయింది.. ఏమైందా అని తల్లి వెళ్లి చూడగా..

Sad: తండ్రి ఒడిలోని పిల్లాడు గుక్క పట్టి ఏడుస్తున్నాడు.. కాసేపటికి ఏడుపు ఆగిపోయింది.. ఏమైందా అని తల్లి వెళ్లి చూడగా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కొందరు మనుషుల్లో మానవత్వం రోజురోజుకూ కనుమరుగైపోతోంది. కన్న బిడ్డ పాల కోసం ఏడుస్తుంటే విషమిచ్చేంత కిరాతకంగా కొందరు మనుషులు మారిపోతున్నారు. పసిబిడ్డ అనే కనికరం కూడా లేకుండా విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. ఈ అమానవీయ ఘటన బీహార్‌లో వెలుగుచూసింది.

ఇంకా చదవండి ...

  కతిహార్: కొందరు మనుషుల్లో మానవత్వం రోజురోజుకూ కనుమరుగైపోతోంది. కన్న బిడ్డ పాల కోసం ఏడుస్తుంటే విషమిచ్చేంత కిరాతకంగా కొందరు మనుషులు మారిపోతున్నారు. పసిబిడ్డ అనే కనికరం కూడా లేకుండా విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. ఈ అమానవీయ ఘటన బీహార్‌లో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌లోని కతిహార్ జిల్లా వీర చంద్‌పూర్ గ్రామానికి చెందిన మున్నా మండల్ అనే 24 ఏళ్ల యువకుడికి, 20 ఏళ్ల పూనమ్ దేవి అనే యువతితో వివాహమైంది. ఈ దంపతులకు యుగ్మిత్ కుమార్ అనే ఏడాదిన్నర వయసున్న బాబు ఉన్నాడు. యుగ్మిత్ తల్లి పాలు తాగడం మానలేదు.

  వ్యవసాయం, పశు పోషణ జీవనాధారంగా ఈ కుటుంబం జీవిస్తోంది. పూనమ్ ఆవు పాలు పితికేందుకు పిల్లాడిని భర్త దగ్గర ఉంచి కొంతసేపు పక్కకు వెళ్లింది. అయితే.. తండ్రి ఒడిలో ఉన్న పిల్లాడు తల్లి పాల కోసం ఏడుపందుకున్నాడు. తల్లి కోసం ఏడుస్తూనే ఉన్నాడు. కొంతసేపటికి పిల్లాడి ఏడుపు ఆగిపోయింది. ఉన్నట్టుండి పిల్లాడు ఏడుపు ఆపేయడంతో పూనమ్‌కు ఏం జరిగిందో అర్ధం కాలేదు. దీంతో.. వెంటనే పూనమ్ కంగారుతో ఇంట్లోకెళ్లి చూసింది. పిల్లాడు ఎలాంటి చలనం లేకుండా భర్త ఒళ్లో పడి ఉండటాన్ని గమనించింది. పిల్లాడు అలా ఎందుకు పడి ఉన్నాడని భర్త మున్నాను పూనమ్ అడిగింది. మున్నా కోపంతో ఏడుపు వల్ల విసుగెత్తిపోయి పాల డబ్బాలో పురుగుల మందు పోసి పిల్లాడికి పట్టించానని భర్త చెప్పడంతో పూనమ్ హతాశురాలైంది. భర్త పక్కనే 100 ఎంఎల్ పురుగుల మందు డబ్బా చూసి కుప్పకూలిపోయింది. పూనమ్ ఆ పిల్లాడిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లింది. మున్నా ఒడిలో ఉన్నప్పుడు చలనం లేకుండా పడి ఉన్నప్పటికీ శ్వాస తీసుకున్న పిల్లాడు పూనమ్ ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలో ప్రాణాలు కోల్పోయాడు. భర్త మూర్ఖత్వం కారణంగా పిల్లాడి ప్రాణాలు పోవడంతో పూనమ్ కన్నీరుమున్నీరయింది. దారుణం జరిగిపోయింది దేవుడా అంటూ గుండెలవిసేలా రోదించింది. ఆ కన్నపేగు విలవిలలాడిపోయింది.

  ఇది కూడా చదవండి: Tragic Car Accident: నడిరోడ్డు మీద తగులబడిన కారు.. సజీవదహనం అయిన మాజీ సీఎం కొడుకు

  అయితే.. పిల్లాడు చనిపోయినట్లు తెలుసుకున్న మున్నా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఇంట్లో నుంచి పారిపోయాడు. భార్యాభర్తలిద్దరి మధ్య కొన్నాళ్లుగా సత్సంబంధాలు లేవని.. ఇద్దరూ ఎడమొహంపెడమొహంగా ఉంటున్నారని పోలీసుల విచారణలో తేలింది. భార్యపై కోపంతో మున్నా ఈ దారుణానికి ఒడిగట్టి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మున్నా వ్యవసాయం చేసుకుంటూ ఆటో నడుపుతుండేవాడు. మున్నాను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. పిల్లాడి మృతదేహాన్ని శనివారం సాయంత్రం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మున్నాలో భార్యపై ద్వేషం, గూడుకట్టుకున్న మూర్ఖత్వం అభంశుభం తెలియని పిల్లాడి ప్రాణాన్ని తీసింది.

  Published by:Sambasiva Reddy
  First published:

  Tags: Bihar, Crime news, Mother milk

  ఉత్తమ కథలు