భార్య కళ్ల ముందే పని మనిషితో భర్త పాడు పని.. విసుగు చెందిన భార్య ఏం చేసిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

సమాజంలో రోజు రోజుకీ విలువలు పతనమవుతున్నాయి. కామంతో కళ్లుమూసుకుపోయి వావి వరుసలు మరిచి వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. నిండు కాపురాలను నిలువునా కూల్చేస్తున్నాయి.

 • Share this:
  సమాజంలో రోజు రోజుకీ విలువలు పతనమవుతున్నాయి. కామంతో కళ్లుమూసుకుపోయి వావి వరుసలు మరిచి వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. నిండు కాపురాలను నిలువునా కూల్చేస్తున్నాయి. కొన్ని సార్లు.. ఈ వివాహేతర సంబంధాలు ప్రాణాలు కూడా తీసేస్తున్నాయ్ . రోజు రోజుకీ ఇలాంటి అక్రమ సంబంధాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. భార్య ఇంట్లో ఉండగానే.. ఓ వ్యక్తి పని మనిషితో సంబంధం పెట్టుకున్నాడు. ఆమె కళ్లెదుటే.. శృంగారంలోనూ పాల్గొన్నాడు. అంతేకాకుండా.. భర్త తరచూ అశ్లీల చిత్రాలను ఇంటర్నెట్ లో షేర్ ఛేస్తూ ఉండేవాడు. దీంతో.. వీటన్నింటినీ చూసి విసిగిపోయిన అతని భార్య.. తన భర్తపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.తిరవల్లూరు జిల్లాలోని తిరుమలిసాయ్ ప్రాంతానికి చెందిన దివ్య కి ముత్తు తో 2006లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పాపకు 9 సంవత్సరాలు కాగా.. బాబుకి రెండు సంవత్సరాలు.పెళ్లైన కొంతకాలనికే ఆమె భర్త నిజస్వరూపం తెలిసిపోయింది. ఉద్యోగానికి వెళ్లకుండా.. అదనపు కట్నం తేవాలంటూ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత.. భర్త వ్యాపారం చేస్తానంటూ..తన బంగారం మొత్తం తనఖా పెట్టి.. డబ్బులు సమకూర్చి ఇచ్చింది.

  ఆ డబ్బుతో అతను వ్యాపారం ప్రారంభించాడు. ఈ క్రమంలో దివ్య 2018లో రెండోసారి గర్భం దాల్చింది. ఈ క్రమంలో.. ఇంట్లో పనిమనిషి అంటూ ఓ మహిళను తీసుకువచ్చి ఇంట్లో పెట్టాడు. అప్పటి నుంచి ఆ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.ఆమె కళ్లెదుటే.. పని మనిషితో శృంగారంలో పాల్గొనేవాడు. ఆ తర్వాత వ్యాపారంలో వచ్చిన ఆదాయం మొత్తం సదరు మహిళకు ఇవ్వడం మొదలుపెట్టాడు. అశ్లీల చిత్రాలను ఇంటర్నెట్ లో పోస్టు చేయడం లాంటి కార్యక్రమాలు కూడా మొదలుపెట్టాడు.

  రోజురోజుకీ భర్త అకృత్యాలు పెరిగిపోతుండటంతో.. బాధితురాలు దివ్య.. ఇటీవల చెన్నై పోలీసు కమిషనరేట్ లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక అశ్లీల చిత్రాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.
  Published by:Sridhar Reddy
  First published: