హోమ్ /వార్తలు /క్రైమ్ /

Crime news: జస్ట్​ ఫోన్​ చేసి 50 లక్షలు కొట్టేసిన ఆంధ్రప్రదేశ్​ వాసి.. నేరం చేసిన తీరు తెలిస్తే షాక్​ అవ్వాల్సిందే..

Crime news: జస్ట్​ ఫోన్​ చేసి 50 లక్షలు కొట్టేసిన ఆంధ్రప్రదేశ్​ వాసి.. నేరం చేసిన తీరు తెలిస్తే షాక్​ అవ్వాల్సిందే..

 (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

ఆంధ్రప్రదేశ్​కు చెందిన ఓ ఘరానా. జస్ట్​ ఫోన్​ కాల్స్​తోనే రూ. 50 లక్షలు కొట్టేశాడు. ఈ నేరం చేసిన తీరు తెలిస్తే షాక్​ అవ్వాల్సిందే..

(Srinivas P, News18, Karimnagar)

పెద్దపల్లి (Peddapalli) జిల్లాకు చెందిన వ్యక్తి ఓ మాయగాడి ఉచ్చులో పడి లక్షలు పోగొట్టుకున్నాడు.  ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ లో పెద్దపల్లి ఇన్చార్జి డీసీపీ అఖిల్ మహజన్ వివరాలు  వెల్లడించారు.  ఆంధ్ర ప్రదేశ్ (Andhra pradesh)రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ ప్రాంతానికి చెందిన కోమలి ప్రకాష్ (Komali Prakash) జల్సాలకు అలవాటు పడ్డాడు . ప్రతిసారీ గోవాకు వెళ్లి జల్సాలు చేసేవాడు . సొంత వ్యాపారాన్ని పట్టించుకోకపోవడం ఆర్థికంగా నష్టపోయాడు . సులువుగా డబ్బులు సంపాదించాలని కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్ (Hyderabad)​కు మకాం మార్చాడు . తెలుగు మాట్రిమోనీ (Telugu Matrimony) పేరుతో నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేసి .. అబ్బాయిలకు ఫోన్ చేసి ఆడ గొంతుతో మాట్లాడుతూ వివిధ ప్రాంతాలకు చెందిన వారి నుంచి రూ .50 లక్షలు వసూలు చేశాడు . ఇదే క్రమంలో ఫేస్​బుక్ (Facebook)​లో దివ్యశ్రీ పేరిట నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేసి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు . దానిని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లోని శాంతినగర్​కు చెందిన మూడెత్తుల సురేశ్ (Suresh) యాక్సెప్ట్ చేయడంతో అమ్మాయి గొంతుతో ముగ్గు లోకి దింపాడు.

అబ్బాయే ఆడగొంతుతో మాట్లాడుతున్నట్లు..

తన కుటుంబ సభ్యులకు అనారోగ్యం ఉందని , అత్యవసరంగా డబ్బులు అవసరమని కోరాడు . ఇలా సురేశ్ వివిధ సమయాల్లో మొత్తంగా రూ .15 లక్షలు పంపాడు . అయితే తిరిగి సురేశ్​ కొద్దిరోజుల డబ్బులు చెల్లించాలని అడుగుతున్నా అవతలి వ్యక్తి నుంచి స్పందన లేదు . దీంతో మోసపోయానని గ్రహించిన సురేశ్ ఎన్టీపీసీ పోలీసులకు (NTPC Police) ఫిర్యాదు చేశాడు . వారు విచారణ చేపట్టగా .. అనేక విషయా లు వెలుగులోకి వచ్చాయి . ఆడగొంతుతో (Lady Voice) మాట్లాడుతున్నది సూర్యప్రకాశ్ అని నిర్ధారణకు వచ్చారు . ఎప్పటిలాగే సురేశ్​తో ఫోన్ చేయించి .. డబ్బులు ఇస్తానని గోదావరిఖనికి రావాలని సూచించారు . అయితే తన బాబాయిని పంపిస్తున్నానని చెప్పిన సూర్యప్ర కాశ్ .. తానే నేరుగా గోదావరిఖనికి రావడంతో పోలీసులు వల పన్ని పట్టుకున్నారు . అతడి బ్యాంకు ఖాతాలో ఉన్న రూ .14 లక్షలను నిలుపుదల చేయించారు . రెండు సెల్​ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు .

మోసం చేసినా తీరు..

సూర్యప్రకాశ్ 2016 లో ఓ అమ్మాయితో గోవాకు వెళ్లి గ్యాంబ్లింగ్ గేమ్​కు అలవాటు పడ్డాడు . ఈ క్రమంలో సొంత వ్యాపారాన్ని సరిగా పట్టించుకోక పోవడంతో నష్టాలపాలయ్యాడు . అప్పటికే చేసిన అప్పులు తీర్చడం లేదని బాధితులు ఫిర్యాదు చేయగా .. 2018 లో కాకినాడ రూరల్ తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది . అదే సమయంలో సదరు అమ్మాయి అతడిని వదిలి వెళ్లిపోయింది . 2019 లో హైదరాబాద్ చేరుకుని షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాడు . వచ్చిన డబ్బులతో గోవా వెళ్లి గ్యాంబ్లింగ్ ఆడేవాడు . ఈ క్రమంలో నెల్లూరుకు చెందిన ఓ వివాహిత తెలుగు మాట్రిమోనీలో పరిచయం కావడంతో ఆమెకు రూ . 18 లక్షల వరకు ఇచ్చాడు .

హైదరాబాద్ అల్వాల్​కు చెందిన మరో అమ్మాయితో కలిసి తిరిగేవాడు . వారి మధ్య మనస్పర్ధలు రావడంతో ఆమె సూర్యప్రకాశ్​పై రాంగోపాల్ పేట్ పోలీస్ స్టేషన్లో లైంగికదాడి కేసు నమోదు చేయగా .. జైలుకు వెళ్లి వచ్చాడు . ఇక తన జల్సాలకు డబ్బులు చాలకపోవడంతో ఆడగొంతు తో ఫోన్ చేసి మాట్లాడుతూ .. అబ్బాయిలను మోసం చేస్తున్నాడు . చివరకు కటకటాల పాలయ్యాడు ”అని పెద్దపల్లి డీసీపీ అన్నారు . సోషల్ మీడియాలో ఇలాంటి నకిలీ మాయగాళ్ల ఫోన్ కాల్స్ కు  ఎవరు రెస్పాండ్ కావద్దని.. ఎవరైనా ఇబ్బంది పెడితే వెంటనే పోలీసులకు తెలపాలన్నారు.

First published:

Tags: Andhra Pradesh, Cheating case, Karimangar, Police arrest

ఉత్తమ కథలు