ఢిల్లీలో మరోసారి కాల్పులు... షహీన్ బాగ్‌లో కలకలం...

ఢిల్లీలోని షహీన్ బాగ్‌లో ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. పోలీసులు అతడిని కస్టడీలోకి తీసుకున్నారు.

news18-telugu
Updated: February 1, 2020, 5:43 PM IST
ఢిల్లీలో మరోసారి కాల్పులు... షహీన్ బాగ్‌లో కలకలం...
ఢిల్లీలోని షహీన్ బాగ్‌లో కాల్పులు జరిపిన వ్యక్తి (Image: ANI/Twitter)
  • Share this:
ఢిల్లీలోని షహీన్ బాగ్‌లో ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. పోలీసులు అతడిని కస్టడీలోకి తీసుకున్నారు. తాజాగా ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్సిటీ వద్ద సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వారి మీద ఓ యువకుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఓ విద్యార్థిగాయపడ్డాడు. మూడు, నాలుగు రోజుల్లోనే మరోసారి ఢిల్లీలోనే కాల్పులు జరపడం చర్చనీయాంశంగా మారింది. కాల్పులు జరిపిన వ్యక్తి ఎవరనే విషయం ఇంకా తెలియలేదు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల కస్టడీలో ఉన్నాడు. సీఏఏ, ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తూ గత కొంతకాలంగా షహీన్ బాగ్‌లో నిరసనకారులు ధర్నాలు చేస్తున్నారు. దీనిపై ఢిల్లీలోని అధికార ఆమ్ ఆద్మీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాల మధ్య ఎన్నికల యుద్ధం కూడా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఓ యువకుడు షహీన్ బాగ్‌లో కాల్పులు జరపడం దుమారం రేపుతోంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలో ఆ యువకుడు మాట్లాడుతూ ‘మా దేశంలో మరెవరిదీ నడవదు. కేవలం హిందువులకే నడుస్తుంది.’ అని వ్యాఖ్యానించి మాటలు వీడియోలో ఉన్నాయి.First published: February 1, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు