A MAN DEFRAUDED YOUNG WOMEN ON FACEBOOK IN ANDHRA PRADESH BN
ఫేస్బుక్లో యువతులకు వల.. ఆపై నగ్న చిత్రాలుగా మార్చి..
ప్రతీకాత్మక చిత్రం
కొంతకాలంగా రాజుపాలెంలో ఓ ప్రైవేటు పాఠశాలను సైతం నిర్వహిస్తున్నాడు. ఆ పాఠశాలలో ఉపాధ్యాయురాలిని కారులో గుంటూరు జిల్లా చిలకలూరిపేట పరిధిలో ఓ గ్రామానికి తీసుకెళ్లాడు.
అతడి పేరు రాజ్‌కుమార్. బట్ట తలతో నిగనిగలాడుతుంటాడు. కానీ తన బట్టతలను విగ్గు పెట్టి కవర్ చేస్తూ హీరోలా ఫోజులిస్తాడు. అనంతరం ఫేస్బుక్లో యువతులకు తన మాయ మాటలతో వలపు వల విసురుతాడు. అంతే పరిచయం అయిన యువతుల ఫొటోలు సేకరిస్తాడు. ఆ చిత్రాలను కాస్త నగ్న చిత్రాలుగా మార్చి యువతులను బెదిరించి నిలువునా దోచేస్తాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా పగిడ్యాలకు చెందిన రాజ్‌కుమార్ పలు మారుపేర్లతో కొంతకాలంగా చలామణి అవుతున్నాడు. ఇతడికి భార్య పిల్లలు ఉన్నారు. కాగా, కొంతకాలంగా రాజుపాలెంలో ఓ ప్రైవేటు పాఠశాలను సైతం నిర్వహిస్తున్నాడు. ఆ పాఠశాలలో ఉపాధ్యాయురాలిని కారులో గుంటూరు జిల్లా చిలకలూరిపేట పరిధిలో ఓ గ్రామానికి తీసుకెళ్లాడు. అక్కడ నిర్బంధించి పలు రకాలుగా హింసించాడు.
ఆమె అదృశ్యం కావడంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఈనెల ఒకటో తేదీన సదరు బాధిత ఉపాధ్యాయురాలు తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది. దీంతో ప్రొద్దుటూరు పోలీసులు రంగంలోకి దిగి రాజ్‌కుమార్‌ను అరెస్టు చేశారు. రాజ్‌కుమార్ ఫేస్బుక్ ద్వారా పలువురు యువతులను మోసగించి నగదు, బంగారం దోచుకున్నట్టుగా విచారణలో తేలింది. నిందితుడిపై వివిధ రాష్ట్రాల్లో అతడిపై 12 కేసులు నమోదయ్యాయి.
Published by:Narsimha Badhini
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.