KTR పీఏనని అంటూ... రూ. 15 లక్షలకు టోకరా.. పరారీలో నిందితుడు

ఎమ్మెల్యే స్థాయి వ్యక్తుల నుంచి మొదలుపెడితే మంత్రులు.. ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించే వారి పేర్లను కూడా విచ్చలవిడిగా వాడేసుకుంటున్నారు మోసగాళ్లు. అది తెలియని అమాయకజనం నిండా మునుగుతున్నారు.

news18
Updated: November 13, 2020, 7:47 AM IST
KTR పీఏనని అంటూ... రూ. 15 లక్షలకు టోకరా.. పరారీలో నిందితుడు
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: November 13, 2020, 7:47 AM IST
  • Share this:
ప్రజా ప్రతినిధుల పేర్లను చెప్పుకుని మోసాలు చేయడం ఈ మధ్య ఎక్కువవుతున్నది. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తుల నుంచి మొదలుపెడితే మంత్రులు.. ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించే వారి పేర్లను కూడా విచ్చలవిడిగా వాడేసుకుంటున్నారు మోసగాళ్లు. అది తెలియని అమాయకజనం నిండా మునుగుతున్నారు. ఇటీవలే ఒక వ్యక్తి తాను తెలంగాణ సీఎం కేసీఆర్ దగ్గర గన్ మెన్ గా పనిచేస్తానని పలువురి దగ్గర డబ్బులు వసూలు చేస్తుండగా పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన మరువకమేందే మరో వ్యక్తి.. తాను మంత్రి కేటీఆర్ పీఏనని చెప్పుకుంటూ మోసానికి యత్నించాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలివిగో..

వివరాల్లోకెళ్తే... జూబ్లిహిల్స్ కేంద్రంగా పనిచేస్తున్న వివిన్ డ్రగ్స్ ఫార్మాస్యూటికల్స్ సంస్థకు జిన్నారం మండలం గడ్డిపోతారం గ్రామంలో ఒక ఫార్మా పరిశ్రమ ఉంది. ఈనెల 6 వ తేదీన కాలుష్య నియంత్రణ మండలికి చెందిన అధికారులతో ఆ కంపెనీ యాజమాన్యం సమావేశమైంది. 7 వ తేదీన రాత్రి పూట సంస్థ డీజీఎం జె.మురళీమోహన్ కు గుర్తుతెలియని నంబర్ నుంచి ఒక ఫోన్ వచ్చింది. ఆయన కాల్ లిఫ్ట్ చేయగానే.. అవతలి వ్యక్తి తన పేరు తిరుపతి రెడ్డి అని.. తాను కేటీఆర్ దగ్గర పీఏగా పనిచేస్తున్నానని చెప్పాడు. వివిన్ సంస్థ కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలకు విరుద్ధంగా ఉందని.. దానిని పొల్యూషన్ బోర్డు మూసేయాలని చూస్తుందని చెప్పాడు.

ప్రభుత్వంలో ఉన్నవాళ్లం గనక తమకు అన్ని విషయాలు తెలుస్తాయని... ఈ సమస్య నుంచి సదరు సంస్థను గట్టెక్కించే పూచీ నాదని ఆయనకు హామీ ఇచ్చాడు. అయితే ఇందుకోసం రూ. 15 లక్షలు ఖర్చవుతుందనీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులోని సభ్యులకు ఆ నగదు ఇవ్వాల్సి ఉంటుందని నమ్మించాడు.

కేటీఆర్ పీఏ అని చెప్పడంతో నిజమేనని నమ్మిన వివిన్ సంస్థ యాజమాన్యం.. డబ్బులివ్వడానికి ఒప్పుకున్నది. ఈ నేపథ్యంలో తిరుపతి రెడ్డిగా పరిచయం చేసుకున్న పీఏ.. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ప్రాంతానికి చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకు.. ఇతర ఖాతాల నంబర్లు ఇచ్చాడు. ఆయా ఖాతాల పేరు బి.నాగరాజుగా ఉంది. దీంతో అనుమానమొచ్చిన వివిన్ ప్రతినిధులు పోలీసులకు ఫోన్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. ఆయన కేటీఆర్ పీఏ కాదు అని నిర్ధారించుకున్నాక.. నిందితుడిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు ఫోన్ చేసిన నంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అతడు పరారీలో ఉన్నట్టు తెలుస్తున్నది. త్వరలోనే నిందితుడి గుట్టు తేలుస్తామని జూబ్లిహిల్స్ పోలీసులు తెలిపారు.

కాగా, ఐదు రోజుల క్రితం తాను సీఎం కేసీఆర్ గన్ మెన్ అనుకుంటై డబ్బులు వసూలు చేస్తున్న ఫేక్ పోలీస్ ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని నందికొండకు చెందిన సంతోష్... తాను సీఎం వద్ద గన్ మెన్ గా పనిచేస్తానని.. తనకు డబ్బులిస్తే ఏ పనైనా చేసి పెడతానని జనాలను నమ్మించి.. వారిదగ్గర డబ్బలు వసూలు చేశాడు. విషయం తెలుసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు సంతోష్ ను అరెస్టు చేశారు.
Published by: Srinivas Munigala
First published: November 13, 2020, 7:46 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading