హోమ్ /వార్తలు /క్రైమ్ /

ప్రాణం తీసిన భూతగాదాలు.. గొడ్డళ్లతో నరికి చంపిన దుండగులు

ప్రాణం తీసిన భూతగాదాలు.. గొడ్డళ్లతో నరికి చంపిన దుండగులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా.. గెట్ల పంచాయతీలు ఎటూ తెగడం లేదు. నాటు వేసేప్పుడు, దుక్కి దున్నేప్పుడు... ప్రతి పంటకూ పంచాయితీలే. అవి తెగవు. పంచాయితీలు కాకమానవు.

  • News18
  • Last Updated :

గ్రామాలలో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న భూతగాదాల కారణంగా ప్రాణాలు పోతున్నాయి. చిన్న చిన్న తగాదాలకే మనుషులను అత్యంత దారుణంగా చంపుతున్న ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా.. గెట్ల పంచాయతీలు ఎటూ తెగడం లేదు. నాటు వేసేప్పుడు, దుక్కి దున్నేప్పుడు... ప్రతి పంటకూ పంచాయితీలే. అవి తెగవు. పంచాయితీలు కాకమానవు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన వాళ్లు తమ ప్రత్యర్థులను అత్యంత దారుణంగా హత్య చేస్తున్నారు. ఇలాంటి ఘటనే కరీంనగర్ జిల్లాలో గురువారం వెలుగులోకి వచ్చింది. భూ తగాదాల కారణంగా.. ఒక వ్యక్తిని గొడ్డలితో నరికి చంపారు దుండగులు.

ఈ ఘటనకు సంబంధించి.. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మోటుపల్లి గ్రామంలో జరిగిందీ దారుణం. గ్రామానికి చెందిన రాసమల్ల సంపత్ (45) హత్యకు గురయ్యాడు. ఆయనకు తన పక్కన ఉన్న భూమికి చెందిన వారితో కొద్దికాలంగా తగాదాలు అవుతున్నాయి. ఇదే విషయమై పలుమార్లు ఊర్లో పెద్దల సమక్షంలో పంచాయితీలు కూడా అయ్యాయి. అయినా ఈ సమస్య ఎటూ కొలిక్కిరాలేదు.

ఇది కూడా చదవండి.. Gang Rape: భర్త చూస్తుండగానే... మహిళపై 17 మంది గ్యాంగ్ రేప్

నాట్లు వేసే సమయం కావడంతో.. గెట్ల పంచాయితీ మళ్లీ మొదటికొచ్చింది. గతంలో ఉప సర్పంచ్ గా పనిచేసిన సంపత్.. వివాదాల్లో ఉన్న భూమిని మళ్లీ సాగుచేయడానికి ప్రయత్నించగా.. ఆ భూమి వాళ్లే హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. ఈరోజు ఉదయం పొలంలోకి వెళ్లిన సంపత్ ను వాళ్లే.. గొడ్డలితో దాడి చేసి హత్య చేశారని అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో సంపత్ మృతదేహం పడి ఉంది. ఆయన తల్లికి తీవ్ర గాయాలవ్వగా.. ఆమెను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

First published:

Tags: Crime, Crime news, Karimangar, Murder, Telangana

ఉత్తమ కథలు