news18
Updated: November 23, 2020, 10:38 PM IST
ప్రతీకాత్మక చిత్రం
- News18
- Last Updated:
November 23, 2020, 10:38 PM IST
నాగరిక సమాజం ఎంత ముందుకు వెళ్తున్నా... కొంతమంది మనుషులు మాత్రం ఇంకా అనాగరింకగానే వ్యవహరిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ ల యుగంలో.. మనిషి అంతరిక్ష యానాలు చేస్తుంటే.. మరోవైపు దేశంలో మూఢ నమ్మకాలు అమాయక మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. ఉపగ్రహాల మీద భూములు కొనుగోలు చేయడానికి వెళ్తున్నా.. భూగ్రహంలో మాత్రం ఇంకా తన పాత పద్దతులను వీడటం లేదు మనిషి. మంత్రాల పేరిట మనుషులను చంపుతూనే ఉన్నాడు. చెప్పుడు మాటలు విని.. అమాయకులను బలి తీసుకుంటున్న ఘటనలు ఆదివాసీ ఏరియాలలో నిత్య కృత్యమవుతున్నాయి. ఇదే తరహా ఘటన ఆసిఫాబాద్ లో ఆదివారం రాత్రి వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకెళ్తే.. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలో దారుణం చోటు చేసుకుంది. మాంత్రాల నెపంతో ఒక వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్యచేశారు. తిర్యాణి మండలం తాటి మాదర గ్రామానికి చెందిన ఆత్రం లచ్చు పటేల్ ఎప్పటిలాగే రాత్రి భోజనం చేసి తన పంటపొలంలో కాపలా ఉండేందుకు వెళ్ళాడు. రాత్రి నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో మెడ నరికి కిరాతకంగా హతమార్చారు.
తెల్లారినా లచ్చు పటేల్ ఇంటికి రాకపోవడంతో పంటపొలానికి వెళ్ళి చూసిన తల్లికి గుండెలు పగిలాయి. లచ్చు పటేల్ రక్తం మడుగులో పడి విగత జీవిగా ఉన్నాడు. ఒళ్లంతా రక్తం. ప్రాణం లేదు. దీంతో ఆ తల్లి రోధనలు ఆ అడవిలో మిన్నంటాయి. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనాస్థలానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకున్నారు. కాగా మంత్రాలు చేస్తున్నాడని తరచూ బంధువులు గొడవపడేవారని, వారే ఈ హత్య చేసి ఉంటారని మృతుడి భార్య ఆత్రం మైనబాయి అనుమానం వ్యక్తం చేసింది.
Published by:
Srinivas Munigala
First published:
November 23, 2020, 10:38 PM IST