నగ్న ఫోటోలతో బాలుడిని బ్లాక్‌మెయిల్ చేసి... లక్షలు దోచేసిన ఫేక్ లేడీ...

అమ్మాయి ప్రొఫైల్ పిక్‌తో కుర్రాడితో ఛాటింగ్ చేసి, న్యూడ్ వీడియోలు పంపాలని రిక్వెస్ట్... అమ్మాయి ఆ ఫోటోలు అడగడంతో వెంటనే పంపిన బాలుడు... ఆ ఫోటోలతో బ్లాక్‌మెయిల్ చేసి లక్షలు దోచేసిన ఫేక్ అకౌంట్ హోల్డర్...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 10, 2019, 6:59 PM IST
నగ్న ఫోటోలతో బాలుడిని బ్లాక్‌మెయిల్ చేసి... లక్షలు దోచేసిన ఫేక్ లేడీ...
అమ్మాయి ప్రొఫైల్ పిక్‌తో కుర్రాడితో ఛాటింగ్ చేసి, న్యూడ్ వీడియోలు పంపాలని రిక్వెస్ట్... అమ్మాయి ఆ ఫోటోలు అడగడంతో వెంటనే పంపిన బాలుడు... ఆ ఫోటోలతో బ్లాక్‌మెయిల్ చేసి లక్షలు దోచేసిన ఫేక్ అకౌంట్ హోల్డర్...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 10, 2019, 6:59 PM IST
అతని వయసు 16 ఏళ్లు. టీనేజ్ వయసులో వచ్చే కోరికల ప్రవాహంతో అల్లాడిపోతున్న సమయంలో సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ అమ్మాయ పరిచయమైంది. మత్తుగా మాట్లాడింది. ఏదో కావాలని డిమాండ్ చేసింది. న్యూడ్ ఫోటోలు పంపమని కోరింది. అంతే ఏ మాత్రం ఆలోచించకుండా అతను నగ్నఫోటోలు పంపేశాడు. ఆ తర్వాత తెలిసింది... అటు పక్కనున్నది అమ్మాయి కాదు! అబ్బాయి అని. న్యూడ్ ఫోటోలు చూపిస్తూ బాలుడిని బ్లాక్‌మెయిల్ చేసి దొరికినకాడికి దోచుకున్నాడు కేటుగాడు. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని బనశంకరి ఏరియాలో వెలుగుచూసింది. రాజీజీనగర ఏరియాకు చెందిన ఓ 16 ఏళ్ల కుర్రాడు... ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ యాక్టివ్‌గా ఉండేవాడు. ప్రొఫైట్ పిక్ మీద అమ్మాయి అందంగా కనిపిస్తే చాలు... ఫాలో అయ్యేవాడు. ఇలా రెండు నెలల క్రితం సదురు బాలికకు ఓ అమ్మాయి పరిచయమైంది. ఫాలో అవ్వగానే రిక్వెస్ట్ అంగీకరించి, మెసేజ్ చేసింది. ఇద్దరి మధ్య ఛాటింగ్ కూడా గడిసింది. మత్తుగా మాట్లాడుతూ సెక్స్ కావాలని అడిగింది. అంతకంటే ముందు నగ్న ఫోటోలు పంపాలని కోరింది.

తాను కోరుకున్నది దక్కిందని తెగ మురిసిపోయిన ఆ బాలుడు... ఆమె సోషల్ మీడియా అకౌంట్‌కు న్యూడ్ ఫోటోలు పంపాడు. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. న్యూడ్ ఫోటో పంపిన తర్వాత వేరే అకౌంట్‌ నుంచి సదరు కుర్రాడికి మెసేజ్ వచ్చింది. న్యూడ్ ఫోటోలు పంపుతూ అమ్మాయిలను వేధిస్తున్నావని తనకు తెలిసిపోయిందని, తాను అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే న్యూడ్ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టడమే కాకుండా వేధింపుల కేసు పెట్టాస్తానని హెచ్చరించాడు. దాంతో అవాక్కైన ఆ కుర్రాడు... ఇంటి బీరువాలో ఉన్న రూ.6 లక్షల 40 వేల డబ్బు, వెండి వస్తువులను దొంగిలించి, చెప్పిన అడ్రెస్‌కు పంపాడు. బీరువాలో డబ్బు కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన తండ్రి నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న తండ్రి సైబర్ నేరగాడి మీద పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు, నిందితుడి కోసం గాలిస్తున్నారు. సదరు బ్లాక్‌మెయిలర్‌కు పది, పన్నెండు ఫేక్ ఖాతాలు ఉన్నట్టు తెలవడం విశేషం. అందమైన అమ్మాయి ఫ్రోఫైల్ పిక్ పెట్టి ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి, ఇలా అందినకాడకి దోచుకుంటున్నాడని తేలింది.
First published: April 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...