A MAN ATTACKED A TRAFFIC POLICEMAN WHEN STOPPED FROM PARKING THE BIKE ON THE MIDDLE ROAD IN BIHAR VB
Traffic Violation: రోడ్డుకు మధ్యలో బైక్ పార్కింగ్.. అక్కడ నుంచి బైక్ ను తీసేయమన్నందుకు ఏం చేశాడో చూడండి..
పోలీస్ ను కొడుతున్న యువకుడు
Traffic Violation: బీహార్‌లోని జెహనాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసును కొట్టిన కేసు తాజాగా వెలుగులోకి వచ్చింది. రోడ్డు మధ్యలో అతడి బైక్ ను పార్క్ చేయండతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. దీంతో అక్కడ నుంచి అతడి బైక్ తీసేయండి అన్నందుకు ఆ యువకడు ట్రాఫిక్ పోలీస్ ను చితక బాదాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బీహార్(Bihar)లోని జెహనాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసును కొట్టిన కేసు తాజాగా వెలుగులోకి వచ్చింది. రోడ్డు మధ్యలో అతడి బైక్ ను పార్క్ చేయండతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. దీంతో అక్కడ నుంచి అతడి బైక్ తీసేయండి అన్నందుకు ఆ యువకుడు ట్రాఫిక్ పోలీస్ ను చితక బాదాడు. అక్కడకు స్థానికులు చేరుకోవడంతో అక్కడ నుంచి తన బైక్ ను వదిలేసి పారిపోయాడు.
జెహనాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న దర్ధా వంతెన సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు పోలీసులు ఇలా తెలిపారు. బీహార్‌లోని జెహనాబాద్‌లో ఉన్న దర్ధా వంతెన సమీపంలో ట్రాఫిక్ పోలీస్ ఎప్పటిలాగే విధులు నిర్వర్తిస్తున్నాడు. అక్కడ ఓ బైక్ ట్రాఫిక్ కు అంతరాయం కలిగే విధంగా పార్క్ చేశాడు.
ఆ బైక్ ను తీసి పక్కన పార్క్ చేయండి.. లేదంటే ట్రాఫిక్ కు ఇబ్బంది అవుతుందని పోలీస్ సలహా ఇస్తాడు. కానీ ఆ బైక్ యజమని.. అతడి మాటలు పట్టించుకోలేదు.. నువ్వెవరు నాకు చెప్పేది అన్నట్లు మాట్లాడాడు. అంతటితో ఆగకుండా కిందపడేసి మరీ దాడి చేశాడు. ఎలాంటి భయం లేకుండా.. పోలీస్ అనే ఆలోచన లేకుండా ఆ యువకుడు పోలీస్ ను కొడుతూనే ఉన్నాడు.
Bihar: A man attacked a traffic policeman after being asked to remove his bike that he had parked in the middle of a road in Jehanabad, police say.
"After attacking, he ran away but left the bike on the spot. A case will be registered against him," says Traffic In-Charge AR Rai pic.twitter.com/Yw1jW4qJkL
ఇలా జరుగుతున్న క్రమంలో వాహన యజమానులు, ఆ రోడ్డుపై అటుగా వెళ్తున్న పాదాచారులు ఆ ఘటనా ప్రదేశానికి వచ్చి గుమిగూడారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. పోలీసులు వస్తున్న విషయాన్ని గమనించిన సదరు వ్యక్తి అక్కడ నుంచి పారిపోయాడు. అతడి బైక్ ను అక్కడే విదిలేసి వెళ్లాడు.
ఈ సంఘటన గురించి ట్రాఫిక్ ఇన్ఛార్జ్ ఏఆర్ రాయ్ ఇలా మాట్లాడాడు. ఉదయం నుంచి ఆ ట్రాఫిక్ పోలీసుల విధుల నిర్వహిస్తున్న ప్రాంతంలో ట్రాఫిక్ అంతరాయం బాగా ఏర్పడిందని.. ఇంకా ఎక్కువ కాకూడదనే ఉద్దేశ్యంతో రోడ్డు పక్కన ఉన్న వాహనాలను తీయాలని సదరు ట్రాఫిక్ పోలీస్ చేసినట్లు చెప్పాడు. ఆ బైక్ పార్కింగ్ వల్ల ట్రాఫిక్ అనేది అధికం కావడానికి చాన్స్ ఉంది.
అందుకే అతడు వెళ్లి విషయం చెప్పినా పట్టించుకోకపోగా.. ట్రాఫిక్ పోలీస్ పైనే దాడికి పాల్పడ్డాడు. ట్రాఫిక్ రూల్స్ ను ఉల్లంఘించినందకు.. విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీస్ పై విచక్షణారహితంగా కొట్టడం లాంటివి చేయడంతో అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. ట్రాఫిక్ పోలీసు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అతను ఎటువైపు వెళ్లాడో పరిశీలిస్తున్నారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.