Shocking: సొంత నానమ్మ అని కూడా చూడలేదు.. చివరకు ఇలా చేశాడు..

దిలీప్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

Unexpected Incident: ఓ యువకుడు తన ఇంట్లో జరుగుతున్న కుటుంబ కలహాలకు కారణం తన నానమ్మ అనుకున్నాడు. దీంతో కోపంతో నానమ్మను ట్రక్కుతో తొక్కించి హత్య చేశాడు. ఈ ఘటన బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లోని కర్జా పోలీస్ స్టేషన్‌ పరిధిలోని రక్ష గ్రామంలో చోటు చేసుకుంది.

 • Share this:
  ప్రతీ కుటుంబం(Family)లో మనస్పర్థలు, గొడవలు(Fightings) అనేవి వస్తూనే ఉంటాయి. వాటిని కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం(Solutions) అవుతాయి. అలా కాకుండా గొడవను ఇలానే కొనసాగించుకుంటూ పోతే.. ఒకరిపై ఒకరు కోపంతో ఉండి.. క్షణికావేశంలో ఘోరాలు జరగిపోతాయి. ఇలా ఓ యువకుడు తన ఇంట్లో జరుగుతున్న కుటుంబ కలహాలకు కారణం తన నానమ్మ(Grandmother) అనుకున్నాడు. ఆ ఇంట్లో రోజూ గొడవలవుతున్నాయి. ప్రశాంతంగా ఉండాల్సిన ఇంట్లో లొల్లికి నానమ్మే కారణమని ఆమెపై మనవడు కోపం పెంచుకున్నాడు. పండుగకని ఇంటికొస్తే.. ఈ గొడవలేందని నానమ్మపైకి లారీ ఎక్కించి హతమార్చిన ఘటన బీహార్‌ (Bihar) లోని ముజఫర్‌పూర్‌లోని కర్జా(Karja) పోలీస్ స్టేషన్‌ (Police Station) పరిధిలోని రక్ష (Raksha)  గ్రామంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు పోలీసులు ఇలా తెలిపారు.

  Explained: ప్రేమ పెళ్లి కంటే.. పెద్దలు కుదిర్చిన పెళ్లి ఎక్కువ కాలం నిలబడటానికి కారణం ఏంటి.. దీని వెనుక రహస్యం ఇదే..


  ముజఫ్ఫర్‌పూర్‌లోని రక్ష గ్రామానికి చెందిన దిలీప్‌ (Dileep) లారీ నడుపుతూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉన్నాడు. దసరా (Dussehra) పండుగ కోసం ఇంటికి వచ్చాడు. గత రెండు రోజులుగా ఇంట్లో వివాదం జరుగుతోంది. పండుగపూట ప్రశాంతంగా ఉందామని ఇంటికి వస్తే.. కుటుంబ కలహాలతో అతనికి కోపం (Angry) వచ్చేసింది. ఈ గొడవలకు కారణం తన నానమ్మే అని గ్రహించాడు. ఆమెతో కూడా దిలీప్ గొడవ పెట్టుకున్నాడు. దిలీప్ తండ్రి రాజేశ్వర్ రాయ్ (Rajeswar Rai) .. అతడిని మందలించి ఇంటి నుంచి తరిమేశాడు.

  అతడికి వివాహం జరిగి నాలుగు నెలలు.. ఆ ఒక్క మాట పేపర్ పై రాసి భార్య బ్యాగులో వేశాడు.. చివరకు ఏం జరిగిందంటే..


  అతడు ఉపయోగించిన లారీ ఇదే


  అయితే నానమ్మపై ఆగ్రహంతో ఉన్న ఆ యువకుడు‌.. ఉదయం ఇంటి ముందు ముగ్గు వేస్తున్న ఆ వృద్ధురాలిపైకి తన లారీని ఎక్కించాడు. ఆమె అక్కడికక్కడే విపరీతంగా రక్త స్రావం అయి చనిపోయింది. ఆ వృద్ధురాలి పేరు డోమ్నీ దేవి. ఈ సంఘటన తరువాత.. రాజేశ్వర్ రాయ్ కర్జా పోలీస్ స్టేషన్‌లో తన తల్లి డోమ్నీ దేవిని హత్య చేసినట్లు కేసు పెట్టాడు.

  ఓ ఆటోలో ముగ్గురు తాగుబోతులు.. నిర్మాణుష్య ప్రాంతం.. కల్లు తాగిన వివాహిత.. చివరకు ఏం జరిగిందంటే..


  విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు నిందితుడిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. అంతే కాకుండా అతడు హత్య ఉపయోగించిన ట్రక్కును కూడా స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నామని కర్జా పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ నేహా శ్రీవాస్తవ తెలిపారు. కుటుంబ కలహాలతో ఈ హత్య జరిగిందని పోలీసులు తెలిపారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు జరుపుతామని పోలీసులు తెలిపారు.
  Published by:Veera Babu
  First published: