PNG Jewellers: బంగారం దుకాణం యజమానిని తెలివిగా బురిడీ కొట్టించి రెండు కోట్ల రూపాయలకు పైగా మోసం చేశాడు ఒక కేటుగాడు. పుణెకు చెందిన పీఎన్జీ గాడ్గిల్ జ్యువెలర్స్‌ను అతడు లక్ష్యంగా చేసుకున్నాడు.
బంగారం దుకాణం యజమానిని తెలివిగా బురిడీ కొట్టించి రెండు కోట్ల రూపాయలకు పైగా మోసం చేశాడు ఒక కేటుగాడు. పుణెకు చెందిన పీఎన్జీ గాడ్గిల్ జ్యువెలర్స్‌ను అతడు లక్ష్యంగా చేసుకున్నాడు. ఈ మోసానికి పాల్పడిన రోహిత్ కుమార్ శర్మ (59) అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. చండీగఢ్‌లో కొత్త బ్రాంచ్ ఏర్పాటు చేస్తానని పీఎన్జీ గాడ్గిల్ జ్యువెలర్స్ యజమానిని సౌరభ్ విద్యాధర్ గాడ్గిల్‌ను రోహిత్ నమ్మించాడు. ఇందుకు రూ.50 కోట్ల వరకు లోన్ తీసుకోవాలని చెప్పాడు. లోన్ ప్రాసెసింగ్ ఫీజులు, బ్యాంకు ఖర్చుల కోసం గాడ్గిల్‌ను డబ్బు అడిగాడు. 2018 నుంచి విడతల వారీగా రూ.1.60 కోట్లు తీసుకున్నాడు. తాజాగా లోన్ గురించి ఆరా తీసేందుకు గాడ్గిల్ ఫోన్ చేయగా రోహిత్ స్పందించలేదు. దీంతో మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రోహిత్‌కు తన కామన్ ఫ్రెండ్స్ ద్వారా గాడ్గిల్ పరిచయమయ్యారు. అతడు అప్పుడప్పుడూ గాడ్గిల్ జ్యువెలర్స్‌కు వచ్చి వ్యాపారం గురించి ఆరా తీసేవాడు. పుణెలో పేరొందిన పీఎన్జీ జ్యువెలర్స్ బ్రాంచ్‌ను చండీగఢ్‌లో కూడా ఓపెన్ చేద్దామని ప్రతిపాదించాడు. ఇందుకు తాను కూడా సహాయం చేస్తానని గాడ్గిల్‌ను నమ్మించాడు. కొత్త షోరూమ్‌ను ఏర్పాటు చేసే ప్రాంతాన్ని కూడా ఎంచుకున్నారు. జ్యువెలరీ ఏర్పాటు చేసేందుకు రూ.50 కోట్లు లోన్ తీసుకుంటున్నానని చెప్పి, ప్రాసెసింగ్ ఫీజుల కోసం రూ.1.60 కోట్లు వసూలు చేశాడు. తన సొంత బిజినెస్ అవసరాలకు అప్పుగా మరో రూ.57 లక్షలు కూడా తీసుకున్నాడు.
ఫ్రాంచైజీ ఏర్పాటు చేస్తానని...
పీఎన్జీ జ్యువెలర్స్‌కు ఫ్రాంచైజింగ్ హెడ్‌గా ఉన్న అమిత్ జతేంద్ర వైద్య ఈ ఘటనపై స్పందించారు. పంజాబ్, హర్యాణా రాష్ట్రాల్లో అతిపెద్ద జ్యువెలరీ షాప్ ఏర్పాటు చేయాలని తాము ఎప్పటినుంచో ప్రణాళిక వేస్తున్నామని ఆయన చెప్పారు. ‘మా బ్రాండ్ ఫ్రాంచైంజింగ్ తీసుకొని జ్యువెలర్స్ ఏర్పాటు చేసేందుకు రోహిత్ శర్మ ముందుకు వచ్చాడు. ఈ ప్రాజెక్టు కింద నాలుగు, ఐదు జ్యువెలర్స్ ఓపెన్ చేస్తామని చెప్పాడు. బ్రోకరేజీ కింద మాకు రెండు శాతం కమీషన్ ఇస్తానని నమ్మించాడు. లోన్ ప్రాసెసింగ్ ఫీజు కోసమని 2019లో మావద్ద రూ.1.6 కోట్లు తీసుకున్నాడు. ఇందుకు అతడి నుంచి ముందు జాగ్రత్తగా సెక్యూరిటీ చెక్కులను కూడా తీసుకున్నాం. అవి కూడా బౌన్స్ అయ్యాయి. దీంతో పోలీసులను ఆశ్రయించాం’ అని అమిత్ వివరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Published by:Srinivas Munigala
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.