• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • A MAN ALLEGEDLY SLIT HIS WRIST AND MURDERED HIS WIFE ON VALENTINES DAY IN GHAZIABAD MS

ప్రేమికుల రోజు భార్యను లంచ్ కు తీసుకెళ్లి.. ఆమెను హత్య చేసి.. తానూ చేయి కోసుకున్న భర్త

ప్రేమికుల రోజు భార్యను లంచ్ కు తీసుకెళ్లి.. ఆమెను హత్య చేసి.. తానూ చేయి కోసుకున్న భర్త

ప్రతీకాత్మక చిత్రం

భార్యాభర్తలిద్దరూ బయటకు వెళ్లి లంచ్ చేశారు. అక్కడే కొంతసేపు కూర్చొచి కబుర్లు చెప్పుకున్నారు. ఆ రాత్రి ఇంటికొచ్చారు. కట్ చేస్తే.. ఉదయం లేచే సరికి భార్య విగతజీవిగా బెడ్ మీద పడి ఉండగా.. ఆ భర్త మణికట్టు తెగిపోయి ఉంది.

  • News18
  • Last Updated:
  • Share this:
    వాళ్లిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారి ప్రేమకు ప్రతిరూపంగా ఒక కొడుకు కూడా ఉన్నాడు. ప్రతి ఏడాది లాగే వాళ్లు ఈ ఏడాది కూడా ప్రేమికుల రోజు ను ఆనందంగా జరుపుకోవాలనుకున్నారు. అనుకున్నట్టుగానే ఆ భార్యాభర్తలిద్దరూ బయటకు వెళ్లి లంచ్ చేశారు. అక్కడే కొంతసేపు కూర్చొచి కబుర్లు చెప్పుకున్నారు. ఆ రాత్రి ఇంటికొచ్చారు. కట్ చేస్తే.. ఉదయం లేచే సరికి భార్య విగతజీవిగా బెడ్ మీద పడి ఉండగా.. ఆ భర్త మణికట్టు తెగిపోయి ఉంది.

    దారుణమైన ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో చోటు చేసుకుంది. ఢిల్లీకి సమీపాన ఉండే ఈ నగరంలోని వైశాలి కి చెందిన దేవ్జీత్ దత్, పూజా భార్యాభర్తలు. ఐదేళ్ల క్రితం వారికి పెళ్లైంది. వారి ప్రేమకు ప్రతిరూపకంగా ఒక కొడుకు కూడా ఉన్నాడు. అయితే ప్రతి ప్రేమికుల రోజు మాదిరిగానే.. ఈ వాలైంటైన్స్ డే కూడా వాళ్లు హాయిగా గడపాలనుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం వాళ్లు లంచ్ చేయడానికని బయటకు వెళ్లారు. అక్కడ్నుంచి ఇంటికి తిరిగి వచ్చారు. అయితే వచ్చేదారిలో వారి కొడుకును తమ అమ్మనాన్న దగ్గరే వదిలేసి వచ్చాడు దేవ్జీత్. అక్కడ్నుంచి వైశాలిలో వారుంటున్న సెక్టార్-5 ప్రాంతంలోని ఇంటికి చేరుకున్నారు.

    అదే రోజు రాత్రి ఆ భార్యాభర్తలిద్దరూ తీవ్ర క్షోభను అనుభవించారు. కొద్దికాలంగా వారికి అప్పుల బాధలు ఎక్కువయ్యాయి. తాను చేస్తున్న వ్యాపారం కూడా లాభసాటిగా లేకపోవడంతో దేవ్జీత్ దత్ దంపతులు తమకు చావే శరణ్యమని అనుకున్నారు. అదే రోజు రాత్రి పూజను హత్య చేసి.. ఆపై తాను కూడా కత్తితో మణికట్టును కోసుకున్నాడు. రక్తస్రావం కావడంతో స్పృహ తప్పిపోయి అక్కడే పడిపోయాడు.

    ఉదయం కాగానే.. చుట్టుపక్కల వాళ్లు చూసి దీనిపై పోలీసులకు సమాచారమందించారు. దీంతో వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. దేవ్జీత్ ను ఆస్పత్రికి తరలించారు. దేవ్జీత్ కు ఇలా అయిందని.. తన భార్యకు చెప్దామని ఇంట్లోకి వెళ్లిన పోలీసులకు లోపల.. అతడి భార్య కూడా విగతజీవిగా పడి ఉండటం చూసి విస్తుపోయారు. ఆస్పత్రిలో కోలుకున్న తర్వాత దేవ్జీత్ ను విచారించగా అతడు అన్ని వివరాలు చెప్పుకొచ్చాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ ఘటనపై విచారణ చేపట్టారు.
    Published by:Srinivas Munigala
    First published: