హోమ్ /వార్తలు /క్రైమ్ /

Female Partner: అక్క ఇంట్లో అద్దెకు దిగిన కుర్రాడితో పరిచయం.. నాలుగేళ్ల నుంచి శారీరకంగా కలుస్తూనే ఉన్నారు.. ఇప్పుడేమైందంటే..

Female Partner: అక్క ఇంట్లో అద్దెకు దిగిన కుర్రాడితో పరిచయం.. నాలుగేళ్ల నుంచి శారీరకంగా కలుస్తూనే ఉన్నారు.. ఇప్పుడేమైందంటే..

బాధిత యువతి

బాధిత యువతి

నాలుగేళ్ల క్రితం ఆమెకు ఎదురింట్లో ఉండే కుర్రాడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసి నాలుగేళ్లకు పైగా సహ జీవనం చేశారు. ఆ సంబంధం కారణంగా ఆ అవివాహిత గర్భం దాల్చింది. అబార్షన్ చేయించుకుంటేనే పెళ్లి చేసుకుంటానని ఆ యువకుడు తేల్చి చెప్పడంతో ఆమె అతను చెప్పినట్టే చేసింది.

ఇంకా చదవండి ...

  భువనేశ్వర్: నాలుగేళ్ల క్రితం ఆమెకు ఎదురింట్లో ఉండే కుర్రాడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసి నాలుగేళ్లకు పైగా సహ జీవనం చేశారు. ఆ సంబంధం కారణంగా ఆ అవివాహిత గర్భం దాల్చింది. అబార్షన్ చేయించుకుంటేనే పెళ్లి చేసుకుంటానని ఆ యువకుడు తేల్చి చెప్పడంతో ఆమె అతను చెప్పినట్టే చేసింది. ఆమె అబార్షన్ చేయించుకున్న కొన్ని రోజులకే ఆ యువకుడు ముఖం చాటేశాడు. ఆమె వద్ద ఉన్న డబ్బు, నగలతో అక్కడి నుంచి ఉడాయించాడు. తాను మోసపోయిన విషయాన్ని గ్రహించిన ఆ బాధితురాలు తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది. ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనేశ్వర్‌లోని నీలచక్ర నగర్‌కు చెందిన 29 ఏళ్ల యువతికి వివాహం కాలేదు. నీలచక్ర నగర్‌లో అక్కాబావతో కలిసి నివాసముంటోంది. ఇదే క్రమంలో.. నాలుగేళ్ల క్రితం తమ అక్క వాళ్లకు ఉన్న మరో ఇంట్లో డ్రైవర్‌గా పనిచేసే సుశాంత దాస్ అనే ఓ యువకుడు అద్దెకు దిగాడు. ఆ యువకుడికి అద్దెకు ఇచ్చిన ఇల్లు, ఆ యువతి ఉండే ఇల్లు ఇరుగుపొరుగే ఉండటంతో సుశాంత దాస్‌తో యువతికి పరిచయం ఏర్పడింది. ఆ యువకుడు ఆమె ఇంటి ఓనర్ చెల్లి అని తెలిసినప్పటికీ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. అంతేకాదు.. ఆ పరిచయానికి తన శారీరక అవసరాలు తీర్చుకోవడం కోసం ప్రేమ అని పేరు పెట్టాడు. ఆ విషయం గ్రహించలేకపోయిన ఆ యువతి అతనితో ప్రేమలో మునిగి తేలింది.

  పెళ్లి చేసుకుంటానని ఆ యువకుడు నమ్మించడంతో శారీరకంగా కూడా దగ్గరైంది. ఇద్దరూ పలుమార్లు శారీరకంగా కలిశారు. ఇద్దరూ కలిసి ఓ చోట ఇల్లు అద్దెకు తీసుకుని సహ జీవనం చేశారు. ఇటీవల ఆ యువతి గర్భం దాల్చింది. ఆమె పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో అబార్షన్ చేయించుకుంటేనే పెళ్లి చేసుకుంటానని.. సుశాంత దాస్ షరతు పెట్టాడు. అతను పెట్టిన షరతుకు తలొగ్గి అబార్షన్ చేయించుకునేందుకు మనసు రాకపోయినా పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఆ యువతి ఇటీవల అబార్షన్ చేయించుకుంది. ఆమె అబార్షన్ చేయించుకున్న తర్వాత.. జులై 15 నుంచి సుశాంత దాస్ ఆమెకు అందుబాటులో లేకుండా వెళ్లిపోయాడు. అంతేకాదు.. ఆ యువతి వద్దనున్న బంగారం, గోల్డ్ చైన్, రింగ్, ఇయర్ రింగ్స్, డబ్బుతో అక్కడి నుంచి ఉడాయించాడు.

  ఇది కూడా చదవండి: Very Sad: ఈ పసిపిల్లాడి అమాయకమైన ముఖం చూసి కూడా జాలి కలగలేదే.. అసలు చేతులెలా వచ్చాయో..

  దీంతో.. మోసపోయినట్లు గ్రహించిన ఆ యువతి తన తండ్రికి జరిగిన విషయాన్ని చెప్పింది. ఆ యువతి తండ్రి సుశాంత దాస్‌కు ఫోన్ చేసి తన కూతురికి అన్యాయం చేయవద్దని కోరగా.. సుశాంత దాస్ ఆయనతో నోటికొచ్చినట్టు మాట్లాడి దుర్భాషలాడాడు. అంతేకాదు.. తనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే మీ కూతురి నగ్న ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని సుశాంత దాస్ బెదిరించాడు. అయితే.. ఆ యువతి ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  Published by:Sambasiva Reddy
  First published:

  Tags: Bhuvaneshwar, Crime news, Lover cheating, Lovers

  ఉత్తమ కథలు