• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • A LADY WHO RELEASED FROM JAIL COMPLAINT AGAINST HER LOVER FOR REJECTING MARRIAGE IN VIKARABAD SK

నువ్వు దొంగ.. జైలుకెళ్లావు.. పెళ్లి చేసుకోనన్న ప్రియుడు.. ఆ యువతి ఏం చేసిందో తెలుసా?

నువ్వు దొంగ.. జైలుకెళ్లావు.. పెళ్లి చేసుకోనన్న ప్రియుడు.. ఆ యువతి ఏం చేసిందో తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం

''నువ్వు దొంగవు.. చోరీ చేసి జైలుకు వెళ్లావు. నీ లాంటి దాన్ని పెళ్లి చేసుకుంటే నా పరువు పోతుంది. నిన్ను పెళ్లి చేసుకోను.'' అతడు అని స్పష్టం చేశాడు. ఆ తర్వాత ఆమెను పూర్తిగా దూరంపెట్టాడు

  • Share this:
    చోరీ కేసులో జైలుకు వెళ్లిన ఓ యువతి.. ఇటీవలే విడదలయింది. బయటకు వచ్చిన వెంటనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించింది. అందుకోసం తన ప్రియుడిని సంప్రదించింది. కానీ ఆమె జైలుకు వెళ్లాక.. సీన్ మారిపోయింది. వారి ప్రేమ పెటాకులయింది. నిన్ను పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని ఆమె ప్రియుడు తేల్చిచెప్పాడు. జైలుకెళ్లి పరువు తీశావు.. నిన్ను వివాహం చేసుకోనని స్పష్టం చేశాడు. మరి ఆ యువతి ప్లాన్ ఏంటి? యువకుడిని వదిలిపెట్టిందా? చివరకు ఏం చేసింది?

    వికారాబాద్‌కు చెందిన యువతి(21) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేసింది. జిల్లెలగూడ లలితానగర్‌లో నివాసం ఉండేది. ఆమెకు దేవరకొండకు చెందిన విజయ్‌ కుమార్‌(25)తో పరిచయం ఏర్పడి.. అది ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇద్దరు సహజీవనం చేశారు. ఐతే నర్సుగా పనిచేసే ఓ యువతి తన వక్రబుద్ధిని బయటపెట్టుకుంది. గత నెల 14న లలితానగర్‌లోని వృద్ధ దంపతుల ఇంట్లో చోరీచేసింది. కరోనా టీకా పేరుతో మత్తుమందు ఇచ్చి వారి నగలను ఎత్తుకెళ్లింది. ఈ కేసులో పోలీసులు యువతిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.

    ఇటీవలే జైలు నుంచి బయటకు వచ్చిన ఆమె.. నేరుగా వెళ్లి విజయ్ కుమార్‌ని కలిసింది. మనిద్దరం పెళ్లి చేసుకుందామని చెప్పింది. ''నువ్వు దొంగవు.. చోరీ చేసి జైలుకు వెళ్లావు. నీ లాంటి దాన్ని పెళ్లి చేసుకుంటే నా పరువు పోతుంది. నిన్ను పెళ్లి చేసుకోను.'' అతడు అని స్పష్టం చేశాడు. ఆ తర్వాత ఆమెను పూర్తిగా దూరంపెట్టాడు. ఫోన్ చేసినా స్పందిండం లేదు. ఈ క్రమంలోనే ఆమె పోలీసులను కలిసి తన ప్రేమికుడిపై ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసకుంటానని నమ్మించి.. గర్భవతి చేశాడని.. ఇప్పుడు మొఖం చాటేశాడని ఫిర్యాదులో పేర్కొంది. గతంలో అతడితో దిగిన ఫొటోలను పోలీసులకు అందజేసింది. యువతి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

    ఇవి కూడా చదవండి:

    ఆటోలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి.. డ్రైవర్ ఏం చేశాడో తెలుసా? తానే ఢీకొట్టి..

    నడి రోడ్డుపై నగ్నంగా బైక్ రైడింగ్.. వీడియో చూసి పోలీసులు షాక్.. అసలేంటి మ్యాటర్?

    ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురు.. భర్తతో కలిసి ఆటోలో వెళ్తుండగా.. నోట్లో పురుగుల ముందు పోసి..
    Published by:Shiva Kumar Addula
    First published: