నిర్భయలాంటి చట్టాలు ఎన్ని తెచ్చినా మహిళలపై అత్యాచారాలు ఆగడం లేదు. రోజురోజకు పెరుగుతున్నాయి తప్పా.. తగ్గడం లేదు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అక్కా, చెల్లి, పిన్ని అనే వాయివరసలు లేకుండా మృగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏడాది వయస్సున్న పాపల నుంచి వంద సంవత్సరాల వృద్ధురాలిపై కూడా ఇటువంటి దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. నిర్భయ, దిశ లాంటి చట్టాలు ఎన్ని అమలు అవుతున్నా.. కొన్ని సందర్భాల్లో ఎన్ కౌంటర్ చేసినా వారిలో మాత్రం మార్పు రావడం లేదు. ప్రతీ రోజు ఎక్కడో ఒక ప్రాంతంలో ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. చివరకు కాసేపట్లో ప్రసవించబోయే నిండు గర్భిణిని కూడా వదలడం లేదు ఈ మృగాళ్లు. సూర్యాపేట జిల్లా కోదాడలోని తిరుమల ఆసుపత్రికి ప్రసవం కోసం వచ్చిన ఓ గర్భిణిపై ల్యాబ్ టక్నీషియన్ అత్యాచార యత్నానికి యత్నించాడు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
సూర్యాపేట జిల్లా కోదాడలోని తిరుమల ఆసుపత్రికి ఓ గర్భిణి ప్రసవం కోసం వచ్చింది. ఈక్రమంలో ఆమెకు పరీక్షలు నిర్వహించటం కోసం డాక్టర్లు కొన్ని టెస్టులు రాశాడు. టెస్టులు చేయించుకోవటానికి వచ్చిన ఆ గర్భిణి మీద ల్యాబ్ టెక్నీషియన్ అత్యాచారానికి యత్నించాడు. పరీక్షలు చేయలని లోపలికి తీసుకెళ్లి ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసి అత్యంత అసభ్యంగా ప్రవర్తించటంతో ఆమె పెద్ద పెద్దగా కేకలు వేసింది. దీంతో ల్యాబ్ టెక్నీషియన్ శ్రీకాంత్ అక్కడ నుంచి పరారయ్యాడు. ఆ తరువాత గర్భిణీ కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కరోనా పరీక్షలు చేయాలని లోపలికి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడని తాను అడ్డుకోవటంతో అత్యాచార యత్నం చేశాడని బాధితురాలు చెప్పటంతో ల్యాబ్ టెక్నీషియన్ శ్రీకాంత్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
పరారీలో ఉన్న శ్రీకాంత్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆసుపత్రి యజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ బాధిత బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి ఘటనలు జరగకుండా మరిన్ని చట్టాలు తీసుకురావాలని మహిళా సంఘాల సభ్యులు పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Nalgonda, Pregnant women, RAPE, Suryapeta, Telangana crime news