ఫేక్ ప్రొఫైల్‌తో ఎన్నారైకి వల.. పెళ్లి చేసుకుంటానంటూ రూ.65 లక్షలు..

ఆస్తి మొత్తం తన చేతుల్లోకి రాగానే పెళ్లి చేసుకోవడంతో పాటు తన ఆస్తులన్నింటికీ యాజమానివి అవుతావంటూ నమ్మించింది. మాళివిక మాటలు నమ్మిన వరుణ్ ఆమె ఖాతాలోకి రూ.65 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేశాడు.

news18-telugu
Updated: May 28, 2020, 9:15 PM IST
ఫేక్ ప్రొఫైల్‌తో ఎన్నారైకి వల.. పెళ్లి చేసుకుంటానంటూ రూ.65 లక్షలు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మోస పోయేవాళ్లుంటే.. మోసం చేయడంలో తప్పేముందన్న రీతిలో ఓ తల్లికొడుకులు రెచ్చిపోయారు. తమ మోసాలకు భారత మాట్రిమోనిని అడ్డాగా చేసుకుని ఎన్నారైలను బురిడీ కొట్టిస్తున్నారు. ఫైక్ ప్రొఫెల్ క్రియేట్ చేసి ఎన్నారైకు వల వేసి మోసం చేసిన మహిళను పోలీసులు కటకటలాపాలయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌కు చెందిన మాళవిక అనే మహిళ భారత్ మాట్రిమోనిలో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసింది. ఆ ప్రొఫైల్‌ను అడ్డం పెట్టుకుని ఎన్నారైలను మోసం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మోసాలకు పాల్పడేందుకు ఆ మహిల కొడుకు ప్రణవ్ సాయం చేస్తుండేవాడు. అయితే ఇటీవల కాలిఫోర్నియాకు చెందిన వరుణ్ అనే ఎన్నారైతో భారత్ మాట్రిమోని ద్వారా పరిచయం చేసుకుంది. ఆమె ఒక డాక్టర్ నంటూ తనకు చాలా ఆస్తులు ఉన్నాయని చెప్పింది. మా నాన్న చనిపోయాడని.. వారి ఆస్తులన్నీ తన పేరు మీద రాయాలని తల్లి ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు తెలిపింది.

అయితే ఆ ఆస్తులను కాపాడుకునేందుకు తన తల్లిపై న్యాయ పోరాటం చేసేందుకు ఆర్థికంగా సాయం చేయాలంటూ ఎన్నారై వరుణ్‌ను కోరింది. ఆస్తి మొత్తం తన చేతుల్లోకి రాగానే పెళ్లి చేసుకోవడంతో పాటు తన ఆస్తులన్నింటికీ యాజమానివి అవుతావంటూ నమ్మించింది. మాళివిక మాటలు నమ్మిన వరుణ్ ఆమె ఖాతాలోకి రూ.65 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేశాడు. రోజులుగా గడుస్తున్నా.. పెళ్లి విషయమై మాళివిక నుంచి ఏలాంటి స్పందన లేకపోవడంతో వరుణ్ మోసపోయానని గ్రహించాడు.

అనంతరం జూబ్లీహిల్స్ పోలీసులను సంప్రదించడంతో వారు రంగంలోకి దిగి మాళవికతో పాటు ఆమె కొడుకును ప్రణవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలావుంటే.. గతంలో మాళవిక తన భర్త, అత్తతో కలిసి ఇదే తరహాలో ఎన్నారైను మోసం చేసినందుకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
First published: May 28, 2020, 9:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading