హోమ్ /వార్తలు /క్రైమ్ /

75 ఏళ్ల వృద్ధాప్యంలోనూ అనుమానంతో భార్యను హతమార్చిన భర్త...

75 ఏళ్ల వృద్ధాప్యంలోనూ అనుమానంతో భార్యను హతమార్చిన భర్త...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నిందితుడు బుచ్చయ్యనే కత్తితో భార్య గొంతు కోసి హతమార్చి, ఆ తర్వాత అదే కత్తితో ఆత్మహత్యకు ప్రయత్నం చేసినట్లు గుర్తించి కేసు నమోదు చేసుకున్నారు. ఇదిలా ఉంటే భార్యపై అనుమానంతోనే బుచ్చయ్య ఈ ఘాతుకానికి ఒడిగట్టిఉండవచ్చని అనుమానిస్తున్నారు.

ఇంకా చదవండి ...

  వరంగల్ రూరల్ జిల్లా హుజారాబాద్ పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. 75 సంవత్సరాల వృద్ధాప్యంలోనూ భార్యపై అనుమానం పెంచుకున్న నిందితుడు ఆమెను హతమార్చి ఆత్మహత్యాయత్నం చేసకున్న ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే నిందుతుడు బుచ్చయ్య(75) కమలాపూర్ మండలం నేరెళ్ల గ్రామంలో భార్య పల్నాటి చిలుకమ్మ(65)తో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే మంగళవారం ఉదయం 10 గంటల సమయం దాటినా బుచ్చయ్య ఇంటి తలుపులు ఎంతకీ తెరవకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. వృద్ధ దంపతులు అస్వస్థతకు గురయ్యారేమో అన్న అనుమానంతో తలుపులు తెరిచి చూడగా, చిలుకమ్మ మృతి చెంది ఉంది. అయితే నిందితుడు బుచ్చయ్య సైతం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో చావుబతుకుల్లో ఉన్న బుచ్చయ్యను స్థానికులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

  పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడు బుచ్చయ్యనే కత్తితో భార్య గొంతు కోసి హతమార్చి, ఆ తర్వాత అదే కత్తితో ఆత్మహత్యకు ప్రయత్నం చేసినట్లు గుర్తించి కేసు నమోదు చేసుకున్నారు. ఇదిలా ఉంటే భార్యపై అనుమానంతోనే బుచ్చయ్య ఈ ఘాతుకానికి ఒడిగట్టిఉండవచ్చని అనుమానిస్తున్నారు. కాగా బుచ్చయ్య, చిలుకమ్మ దంపతులకు ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

  Published by:Krishna Adithya
  First published:

  Tags: Crime, Crime story, Husband kill wife, Murder, Murder attempt

  ఉత్తమ కథలు