అదనపు కట్నం కోసం కట్టుకున్న భార్యనే.. ఎంత పని చేశాడంటే..

తనకు తెలిసిన సురేశ్ అనే పాములు పట్టే వ్యక్తి నుంచి రూ.10వేలకు రెండు పాములు కొనుగోలు చేశాడు. అయితే ఉతారా ఓ రోజు తన గదిలో నిద్రపోతుండగా సూరజ్ పామును ఆమెపైకి విసిరగా, అది కాటు వేసింది.

news18-telugu
Updated: May 24, 2020, 9:33 PM IST
అదనపు కట్నం కోసం కట్టుకున్న భార్యనే.. ఎంత పని చేశాడంటే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఓ వ్యక్తి అదనపు కట్నం కోసం భార్యను చంపేశాడు. అది అషామాషీగా కాదండోయ్.. రెండు రోజుల వ్యవధిలో రెండు సార్లు పాముతో కాటు వేయించి మరి హత్య చేశాడు. ఈ ఘటన కేరళలోని తిరువనంతపురంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..కొల్లం జిల్లా అంచల్‌కు చెందిన సూరజ్ ఓ ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతడికి ఉతారా అనే మహిళను ఏడాది క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఏడాదిన్నర పాటు వారి కాపురం సజావుగా సాగింది. అయితే గతకొద్ది రోజులుగా వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. సూరజ్ తన భార్య ఉతారాపై అదనపు కట్నం కోసం వేధించసాగాడు. అయితే ఉతారా కుటుంబం నుంచి డబ్బులు వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఏలాగైనా ఉతారాను చంపాలని నిర్ణయించుకున్నాడు.

ఆ కేసు తన మీదకు రాకుడదన్న ఉద్దేశంతో ఓ ప్రణాళిక వేశాడు. అందులో భాగంగానే తనకు తెలిసిన సురేశ్ అనే పాములు పట్టే వ్యక్తి నుంచి రూ.10వేలకు రెండు పాములు కొనుగోలు చేశాడు. అయితే ఉతారా ఓ రోజు తన గదిలో నిద్రపోతుండగా సూరజ్ పామును ఆమెపైకి విసిరగా, అది కాటు వేసింది. వెంటనే తెరుకున్న ఉతారా స్థానికుల సాయంతో ఆస్పత్రికి చేరుకుని ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఆ తర్వాత మేన మరోసారి ఉతారాపై పామును వదిలాడు. ఈసారి పాముకాటు వేయడంతో ఉతారా ప్రాణాలు విడిచింది. అయితే సూరజ్ తనకేం తెలియనట్టు పామును చంపే ఇంట్లోనే ఉంటున్నాడు. దీంతో సూరజ్‌పై అనుమానంతో ఉతారా తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
Published by: Narsimha Badhini
First published: May 24, 2020, 9:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading