• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • A HUSBAND WHO KILLED HIS WIFE AND UNCLE WITH A KNIFE IN SUSPICION IN TELANGANA BN

దారుణం.. భార్యపై అనుమానం.. తెల్లారక ముందే తెల్లారిపోయిన భార్య, మామ బతుకులు..

దారుణం.. భార్యపై అనుమానం.. తెల్లారక ముందే తెల్లారిపోయిన భార్య, మామ బతుకులు..

ప్రతీకాత్మక చిత్రం

ఖలీం హైదరాబాద్‌లోనే సైకిల్ మెకానిక్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. అయితే భార్యభర్తల మధ్య గొడవలు జరగడంతో ఎనిమిది నెలల క్రితం పుట్టిల్లు అయిన బాలంపేటకు వచ్చింది.

  • Share this:
    అనుమానం వారి పాలిట పెనుభూతమైంది. ఫలితంగా తెల్లారక ముందే వారి బతుకులు తెల్లారిపోయాయి. ఓ వ్యక్తి భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే భార్యతో ఘర్షణ తలెత్తడంతో కత్తితో నరికేశాడు. అడ్డొచ్చిన మామను సైతం హతమార్చాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం బాలంపేట గ్రామానికి అబ్దుల్ గఫూర్ మియా చిన్న కుమార్తె హాజీ బేగం(32)ను 14 సంవత్సరాల క్రితం హైదరాబాద్‌కు చెందిన ఖలీంకి ఇచ్చి పెళ్లి చేశారు. ఖలీం హైదరాబాద్‌లోనే సైకిల్ మెకానిక్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. అయితే భార్యభర్తల మధ్య గొడవలు జరగడంతో ఎనిమిది నెలల క్రితం పుట్టిల్లు అయిన బాలంపేటకు వచ్చింది. రెండు రోజుల క్రితం గ్రామానికి భర్త ఖలీం వచ్చాడు. మన ఇంటికి వెళదామని కోరగా హాజీ బేగం నిరాకరించింది.

    దీంతో భార్య హాజీ బేగంను అనుమానిస్తూ ఆమెతో ఖలీం ఘర్షణ పడ్డాడు. సోమవారం రాత్రి భోజనాల అనంతరం భార్యభర్తలిద్దరూ ఒక గదిలో, తాత మనుమరాళ్లు మరో గదిలో పడుకున్నారు. మంగళవారం తెల్లవారుజామును భార్యభర్తలు పడుకున్న గదిలోనే ఖలీం భార్యను కత్తితో నరికాడు. ఈ క్రమంలో కూతురు హాజీ బేగంను తండ్రి గపూర్ మియా కాపాడేందుకు అడ్డం వెళ్లాడు. దీంతో మామను సైతం వెంటాడి నరికినట్టు పోలీసులు తెలిపారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు.
    Published by:Narsimha Badhini
    First published:

    అగ్ర కథనాలు