Home /News /crime /

A HUSBAND KILLED HIS WIFE WHO SPENDING TOO MUCH MONEY THAN THEIR FINANCIAL STATUS AFTER INVESTIGATION POLICE CAUGHT AND ARRESTED HUSBAND NZB PRV

Kama reddy: భార్య విలాసాలు భరించలేక ఆమె భర్త ఎంత పెద్ద స్కెచ్​ వేశాడంటే..  ఓ రోజు రాత్రి సడెన్​గా స్నేహితులను పిలిచి..

crime scene

crime scene

వారి ఆర్థిక ప‌రిస్థితిని మ‌రిచి విలాస‌వంతంగా ఉండేందుకు భార్య డ‌బ్బులు కావాలంద‌ని ఆ భర్త పెద్ద స్కెచ్​ వేశాడు. ఓ రోజు రాత్రి సడెన్​గా స్నేహితులను తన ఇంటికి పిలిచాడు.

    వారి ఆర్థిక ప‌రిస్థితిని (Finacial status) మ‌రిచి విలాస‌వంతంగా ఉండేందుకు డ‌బ్బులు కావాలంద‌ని భార్య‌ను కొట్టి చంపాడో భర్త‌ (Husband killed his wife).. అంత‌టితో ఆగ‌కుండా మృత‌దేహాన్ని పంట పోలాల్లోకి తీసుకువెళ్లి కాల్చేశాడు. అయితే మృతదేహం పూర్తిగా దహనం కాక పోవ‌డంతో ఆస‌లు విష‌యం బ‌య‌ట ప‌డింది. రంగంలోకి దిగిన కామారెడ్డి పోలీసులు నిందితున్నిఅరెస్టు చేశారు.

    కామారెడ్డి  (Kama reddy) జిల్లా సదాశివనగర్ మండలం లోని మార్కల్  గ్రామ శివారులో గ‌త నెల‌లో గుర్తు తెలియని మహిళ శ‌వం పొలంలో క‌నిపించింది.. ఆ హత్య కేసును  పోలీసులు చేధించారు.  వివ‌రాల‌ను కామారెడ్డి ఏస్పీ శ్రీనివాస్ రెడ్డి మీడియాకు వెళ్ల‌డించారు..  నవంబ‌ర్ 25 తేదీన సదాశివనగర్ మండలం లోని మార్కల్  గ్రామ శివారులో  25 నుంచి 30 సంవత్సరాల వయస్సు గల ఓ మహిళను గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేసి (Murder) ఇక్కడికి తీసుకువచ్చి కాల్చి వేసిన కేసు సదాశివనగర్ పోలీస్ స్టేషన్ లో నమోదైంది. ఈ కేసు ఈ దర్యాప్తులో భాగంగా రెండు స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశారు. దర్యాప్తు వేగవంతం చేయగా ఒక  బొలెరా వాహనం అనుమానాస్పదంగా మర్కల్ గ్రామంలోకి వచ్చి తిరిగి వెళ్ళి పోయినట్టుగా సీసీ కెమెరాల ద్వారా తెలిసింది. దీంతో ఆ వాహనం గురించి భిక్నూర్ ఇందల్వాయి టోల్ గేట్ సీసీ కెమెరాలు పరిశీలించగా  వాహనం ఇందల్వాయి వైపు వెళ్లలేదని మార్కల్ నుంచి  హైదరాబాద్ వైపు వెళ్ళినట్టుగా గుర్తించారు పోలీసులు.  అ సమయంలో టోల్ గేట్ దాటి వెళ్ళిన వాహనాన్ని పరిశీలించగా TS 08 UF 5551 నెంబర్ గల బొలెరో  వాహనం వెళ్లినట్లు గుర్తించారు.  దాని  ఆధారంగా వాహన యజమానిని విచారించగా విషయం బయటపడింది.

    అర్ధరాత్రి పంట పొలాల్లో..

    మేడ్చల్ జిల్లా గండి మైసమ్మ ప్రాంతంలో ఉండే రంజాన్ ఖాన్, ఫాతిమా ఖాతున్ (26) దంపతులు హైదరాబాద్​లో కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరు ఉత్త‌ర ప్ర‌దేశ్ లోని బ‌ల్ రాంపూర్ జిల్లాకు చెందిన వారు.  అయితే విలాసవంతమైన జీవితం గడపడం కోసం రంజాన్ ఖాన్‌ను భార్య ఫాతిమా ఖాతూన్ నిత్యం వేధించేది. ఆ వేధింపులు భరించలేని రంజాన్ ఖాన్ ఎలాగైనా తన భార్యను అడ్డు తొలగించుకోవాలన్న ఆలోచనతో నవంబ‌ర్ 24న‌ రాత్రి సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న భార్యను లావు కర్రతో తలపై బాది హత్య చేశాడు (Husband kill wife). వెంటనే రంజాన్ స్నేహితులైన రియాజ్ ఖాన్, నన్ బాబు, రిజ్వాన్ ఖాన్, పూజన్ సహాయంతో బొలెరో వాహనంలో ఫాతిమా ఖాతూన్ మృతదేహాన్ని కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మర్కల్ గ్రామానికి తీసుకొచ్చి శివారులో పడేశారు. అనంతరం  పెట్రోల్ పోసి మృతదేహాన్ని కాల్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

    పరారిలో ముగ్గురు..

    విచారణ అనంతరం పోలీసులు వారిని అరెస్ట్ చేసి, ఏ1గా రంజాన్ ఖాన్, ఏ2 రియాజ్ ఖాన్‌లపై కేసు నమోదు చేసి, రిమాండుకు తరలించడం జరిగిందని ఎస్పీ వెల్లడించారు. నన్ బాబు, రిజ్వాన్ ఖాన్, పూజన్‌లు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. హత్య కేసును చేధించిన సదాశివనగర్ సీఐ రామన్, ఎస్ఐ శేఖర్, తాడ్వాయి పీసీఓ రవి, రాజులను ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి అభినందిస్తూ రివార్డు అందజేశారు. ఎక్కడో హత్య చేసి కామారెడ్డి జిల్లాలో మృతదేహాన్ని పడేస్తే నేరస్తులు తప్పించుకోలేరన్నారు. నేషనల్ హైవేపై నిరంతరం పెట్రోలింగ్ జరుగుతుందని, జిల్లా సరిహద్దు నుంచి చివర వరకూ సీసీ కెమెరాలతో నిఘా ఉంటుందని ఎస్పీ పేర్కొన్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Crime news, Husband kill wife, Kamareddy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు