(S.Rafi,News18,Mahabubnagar)
పుట్టింటికి వెళ్ళిన భార్య వెంటనే తిరిగి రాలేదని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా పరిధిలోగల తిమ్మాజీపేట మండలం లోని చోటు చేసుకుంది. ఎస్ఐ హేమ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మారేపల్లి గ్రామానికి చెందిన శివలింగం 28 సంవత్సరాలు భార్య ఈనెల 10న శుభకార్యం కోసం గోరింట గ్రామంలోని పుట్టింటికి వెళ్ళింది. ఇంటికి తిరిగి రావాల్సిందిగా 13న ఫోన్ చేశాడు. ఓ రోజు ఆలస్యంగా వస్తాను అని భార్య చెప్పడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఊరి బయట గుట్ట వద్దకు వెళ్లి పురుగు మందు తాగాడు. తర్వాత వరుసకు తమ్ముడు అయిన బాలస్వామి కి ఫోన్ చేసి చెప్పాడు.
అప్పటికే అతడు అపస్మారక స్థితిలో లో ఉన్న శివలింగాన్ని జడ్చర్ల ఆస్పత్రికి తరలించారు. తర్వాత మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. తదుపరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మరో ఘటనలో..
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని పథకం ప్రకారం ఓ మహిళ ముగ్గురు ప్రియులతో కలిసి భర్తను చంపిన ఘటన చోటు చేసుకుంది. భార్యతో పాటు మరో ముగ్గురు ప్రియులకు రిమాండ్ కు తరలించినట్లు జడ్చర్ల సిఐ రమేష్ బాబు తెలిపారు. వివరాలకు వెళితే.. మహబూబ్నగర్ జిల్లా పరిధిలో గల జడ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో పోలేపల్లి గ్రామానికి చెందిన పర్వతాలకు ఉదండాపూర్ గ్రామానికి చెందిన యాదమ్మ తో ఎనిమిదేళ్ల కిందట వివాహం అయింది. వారికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఈ ఏడాది జూలైలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పర్వతాలు కాళ్ళు విరగడంతో ఇంట్లో ఉండిపోయారు.
యాదమ్మ పోలేపల్లి గ్రామానికి చెందిన శివలింగం, మల్లేష్, నాగరాజు తో వివాహేతర సంబంధం పెట్టుకున్న విషయం తెలియడంతో భర్త పలుమార్లు మందలించాడు. దీంతో భర్త అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న ఆమె జూలై 22న తెల్లవారుజామున నిద్రిస్తున్న పర్వతాలను ముగ్గురు పిల్లలతో కలిసి గొంతుకు కు చున్ని బిగించి చంపారు.
అనంతరం తన భర్త మరణం పై అనుమానం ఉందంటూ ఆమె పోలీస్ స్టేషన్లు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు యాదమ్మ నే పథకం ప్రకారం తన ప్రియులతో కలిసి భర్తను చంపినట్లు గుర్తించారు. యాదమ్మ తో పాటు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా తామే పథకం ప్రకారం హత్య చేసినట్లు ఒప్పుకున్నారని రమేష్ బాబు తెలిపారు. నిందితులు నలుగురిని రిమాండ్ కు తరలించారు అని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Crime news, Mahabubnagar