గత మూడు నెలల (Three months) నుంచి తన భార్య ఆచూకీ పోలీసులు కనిపెట్టడం లేదని , పోలీసుల వైఫల్యం వల్ల తమ కుటుంబం చిన్నా భిన్నం అయిందని 48 గంటల లోపు తన భార్య ఆచూకి (locating his wife)లభించకపోతే తాను తమ పిల్లలు ఈ భూమ్మీద ఉండలేమని పేర్కొంటూ ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో తీసి పంపాడు. అనుమానితుల పై సూసైడ్ నోట్ (Suicide) రాసి సోషల్ మీడియాలో సందేశాలు పంపించాడు. ఈ సంఘటన వికారాబాద్ (Vikarabad) జిల్లా తాండూర్ పపట్టణంలో కలకలం రేపింది. వికారాబాద్ జిల్లా బీఎస్పీ ( BSP) పార్టీ అధ్యక్షుడు దొరి శెట్టి సత్యమూర్తి. తాండూరు పట్టణం శివాజీ చౌరస్తా ప్రాంతంలో భార్యా పిల్లలతో నివాసం ఉంటున్నారు. సత్యమూర్తి భార్య అన్నపూర్ణ (36) ఇంట్లోనే ఉండేంది. అయితే అకస్మాత్తుగా 6.3.2022న అదృశ్యమైంది. ఆ రోజు నుంచి భర్త (Husband)సత్యమూర్తితో పాటు కుటుంబీకులు అన్నపూర్ణ ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. రెండు రోజుల తరువాత తాండూరు పట్టణ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు కూడా చేశారు. ఇప్పటికీ దాదాపు మూడు నెలలు కావొస్తోంది. అయినా ఇప్పటి వరకు ఆచూకీ లభించలేదు. కుటుంబ సభ్యులు అన్నపూర్ణ కనబడితే.. ఆమె ఆచూకీ తెలిస్తే తమను సంప్రదించాలని, ఆమె గురించి తెలిపిన వారికి రూ.5 లక్ష నగదు బహుమతి అందిస్తామని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ వ్యవహారం తాండూరులో చర్చనీయాంశమైంది.
తన భార్యను 48 గంటల్లో కనిపెట్టాలని..
ఇదిలా ఉంటే ఇంటి నుంచి వెళ్లిపోయిన సమయంలో అన్నపూర్ణ నోట్ రాసి వెళ్ళింది. అందులో నా భర్త (Husband) దేవుడు.. పిల్లలు జాగ్రత్త అని రాసి ఉంది. అయితే అప్పటి నుంచి కొన్ని రోజుల వరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి వదిలిపెట్టారు.
సత్యమూర్తి మాత్రం పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ భార్య ఆచూకీపై ముమ్మర ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగా సంబంధిత సీసీ ఫుటేజీలను ఫోన్ రికార్డులను సేకరించి పోలీసులకు (Police) అందజేశారు. అయినా కూడా పోలీసులు తన భార్య ఆచూకీ విషయంపై నిర్లక్ష్యం చేసినట్లుగా భర్త సత్యమూర్తి ఆరోపణలు చేశారు.
ఇక చేసేది ఏమీ లేదని మనో వేదన చెందాడు ఏమో కానీ, సూసైడ్ నోట్ ఫైన కొంతమంది ఫోన్ నెంబర్లు (Phone numbers), వ్యక్తుల పేర్లు రాసి తన భార్యను 48 గంటల్లోగా కనిపెట్టాలని లేదంటే తమ శవాలను చూస్తారని రాత్రి 2 గంటల ప్రాంతంలో సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్ (WhatsApp group)లో లెటర్ పోస్ట్ చేసి పిల్లలతో సహా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
ఈ విషయాన్ని చూసిన స్నేహితులు, బంధువులు సత్యమూర్తి ఇంటికి వెళ్లి ఆరా తీయగా ఇంటికి తాళం వేసి ఉంది. సత్యమూర్తి ఫోన్ నెంబర్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయాయి. ఈ విషయంపై బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు సత్యమూర్తి ఆచూకీ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు.
ఏది ఏమైనా కానీ గత మూడు నెలల నుంచి భార్య అన్నపూర్ణ ఆచూకి కనిపెట్టక పోవడంపై పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని కేసు ఎందుకు నీరుగారుతుందని తాండూరు ప్రజానీకం ప్రశ్నిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Husband, Missing cases, Police, Vikarabad, Wife