భార్యతో అసభ్య ప్రవర్తన.. పక్కింటి వ్యక్తి మర్మాంగం కోసేసిన భర్త..

చెత్త పారేసి తిరిగొస్తుండగా.. పక్కింటిలో ఉండే వ్యక్తి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దాంతో తీవ్ర కోపోద్రిక్తుడైన లోకనాథం ఇనుప రాడ్ తీసుకుని అతని వద్దకు పరిగెత్తుకెళ్లాడు.

news18-telugu
Updated: September 13, 2019, 10:18 AM IST
భార్యతో అసభ్య ప్రవర్తన.. పక్కింటి వ్యక్తి మర్మాంగం కోసేసిన భర్త..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తన భార్య పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆగ్రహంతో ఊగిపోయిన ఓ భర్త.. ఏకంగా అతని మర్మాంగాన్ని కోసేశాడు.తలపై ఇనుపరాడ్‌తో బలంగా బాదడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. విజయనగరం జిల్లా జియ్యమ్మవలసలో ఈ ఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. జియ్యమ్మవలసలో బంటు లోకనాథం,అతని భార్య చాలాకాలంగా నివాసం ఉంటున్నారు. బుధవారం ఉదయం లోకనాథం భార్య.. చెత్త పారేసేందుకు మేడ పైనుంచి కిందకు దిగింది. చెత్త పారేసి తిరిగొస్తుండగా.. పక్కింటిలో ఉండే వ్యక్తి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దాంతో తీవ్ర కోపోద్రిక్తుడైన లోకనాథం ఇనుప రాడ్ తీసుకుని అతని వద్దకు పరిగెత్తుకెళ్లాడు. తలపై దానితో బలంగా మోదడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అక్కడితో ఆగక.. పదునైన చాకుతో అతని మర్మాంగాన్ని కోసేశాడు. అనంతరం అక్కడినుంచి పరారైన లోకనాథం.. అదే రోజు రాత్రి స్థానిక పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

First published: September 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు