Husband: భార్యకు గుండు కొట్టించిన భర్త.. కారణమేంటో తెలిస్తే ఇలాంటి మగాళ్లకు పెళ్లెందుకని అంటారేమో..

తండ్రి, సోదరుడితో బాధిత మహిళ

ఉత్తరప్రదేశ్‌లోని బహ్‌రైచ్‌లో వెలుగుచూసిన ఘటన అదనపు కట్నం కోసం వేధిస్తున్న భర్తల అమానుషానికి అద్దం పడుతుంది. ఒక బైక్, లక్ష రూపాయల డబ్బు‌ను అదనపు కట్నంగా డిమాండ్ చేసిన భర్త.. భార్య ఆ డిమాండ్‌ను తీర్చకపోయేసరికి దారుణానికి ఒడిగట్టాడు.

  • Share this:
    బహ్‌రైచ్: రోజులు మారినా.. 2021లోకి అడుగుపెట్టినా కొందరి ఆలోచనలు మాత్రం ఏమాత్రం మారడం లేదు. ఇప్పటికీ అదనపు కట్నం కోసం కట్టుకున్న భార్యలను వేధిస్తున్న భర్తలుండటం శోచనీయం. ఇలాంటి ఘటనలు రాష్ట్రాలతో సంబంధం లేకుండా రోజుకొకటి వెలుగు చూస్తుండటం గమనార్హం. ఇలా అదనపు కట్నం కోసం భార్యలను వేధిస్తున్న వారిలో కొందరు చదువుకుని ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేస్తున్న ప్రబుద్ధులు కూడా ఉండటం ఆందోళన కలిగించే విషయం. ఉత్తరప్రదేశ్‌లోని బహ్‌రైచ్‌లో వెలుగుచూసిన ఘటన అదనపు కట్నం కోసం వేధిస్తున్న భర్తల అమానుషానికి అద్దం పడుతుంది. ఒక బైక్, లక్ష రూపాయల డబ్బు‌ను అదనపు కట్నంగా డిమాండ్ చేసిన భర్త.. భార్య ఆ డిమాండ్‌ను తీర్చకపోయేసరికి దారుణానికి ఒడిగట్టాడు. భార్యను చావబాది.. అంతటితో అతని క్రూరత్వం చల్లారక ఆమెకు గుండు కొట్టించి పైశాచికంగా ప్రవర్తించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే... బహ్‌రైచ్ ప్రాంతానికి సమీపంలోని సమోఖాన్ అనే గ్రామానికి చెందిన షాజిద్ నేపాల్‌కు చెందిన బసిరున్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఒక పాప కూడా పుట్టింది.

    పెళ్లయి పాప పుట్టిన కొన్నాళ్లు భార్యా, బిడ్డను బాగానే చూసుకున్న షాజిద్ కొన్నేళ్లుగా భార్యను అదనపు కట్నం కోసం వేధించసాగాడు. తనకు లక్ష రూపాయల డబ్బు, ఒక బైక్ కావాలని భార్యను చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టాడు. దాదాపు ఐదేళ్లుగా బసిరున్ భర్త వేధింపులను భరిస్తూ వచ్చింది. కానీ.. షాజిద్ వేధింపులు శృతిమించాయి. భార్య అదనపు కట్నంగా బైక్‌ను, లక్ష రూపాయల డబ్బును ఇవ్వడం లేదని ఆమెను చావబాది కన్నబిడ్డతో సహా ఆమెకు గుండు కొట్టించాడు.

    దీంతో.. భర్త వేధిస్తున్నాడని తండ్రిని వెంటబెట్టుకుని బసిరున్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కానీ.. పోలీస్ స్టేషన్‌లో ఆమెకు న్యాయం జరగలేదు. కనీసం.. ఆమె గోడు కూడా విన్నవారు లేకపోవడంతో స్టేషన్ నుంచి బసిరున్ నిరాశతో వెనుదిరిగింది. దీంతో.. బసిరున్ న్యాయం కోసం ఎస్పీని ఆశ్రయించింది. ఈ కేసుకు సంబంధించి.. నిందితుడైన షాజిద్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
    Published by:Sambasiva Reddy
    First published: