Home /News /crime /

A HEART WRENCHING INCIDENT CAME TO LIGHT IN SHIKOHABAD TOWN OF FIROZABAD DISTRICT OF UTTAR PRADESH SSR

Extremely Sad: ఈమె వయసు 34.. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఆమె కలలో కూడా అనుకోలేదు..

సరోజా

సరోజా

సరోజా, యతేంద్ర కుమార్ భార్యాభర్తలు. యతేంద్ర డయల్ 112 విభాగంలో ఆగ్రాలో పనిచేసేవాడు. శికోహాబాద్‌లోని హౌసింగ్ డెవలప్‌మెంట్ కాలనీలో గత నాలుగేళ్లుగా భార్యాపిల్లలతో కలిసి ఉంటున్నాడు. రెండేళ్ల క్రితం స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకున్నాడు.

ఇంకా చదవండి ...
    ఫిరోజాబాద్: యూపీలోని ఫిరోజాబాద్‌ జిల్లాలో ఘోరం జరిగింది. కట్టుకున్న భార్యను అత్యంత కిరాతకంగా భర్త హతమార్చిన ఘటన కలకలం రేపింది. తుపాకితో ఆమె శరీరంలో నాలుగు బులెట్లు దింపి మరీ ఆమెను భర్త చంపడం శోచనీయం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. సరోజా, యతేంద్ర కుమార్ భార్యాభర్తలు. యతేంద్ర డయల్ 112 విభాగంలో ఆగ్రాలో పనిచేసేవాడు. శికోహాబాద్‌లోని హౌసింగ్ డెవలప్‌మెంట్ కాలనీలో గత నాలుగేళ్లుగా భార్యాపిల్లలతో కలిసి ఉంటున్నాడు. రెండేళ్ల క్రితం స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇల్లు భార్య సరోజా పేరు మీద ఉంది. సరోజా తన ముగ్గురు కూతుళ్లైన ఆకాంక్ష(10), ఆర్తి(8), అన్య(4)తో కలిసి ఆ ఇంట్లోనే ఉంటోంది. యతేంద్ర ఇంటికి వచ్చి వెళుతుండేవాడు. ఏం జరిగిందో తెలియదు.. ఇటీవల ఒకరోజు కూతురు యోగక్షేమాలు తెలుసుకునేందుకు సరోజా తండ్రి రామ్‌ప్రకాష్ ఆమె సెల్ నంబర్‌కు కాల్ చేశాడు. ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో.. రాంప్రకాష్‌కు అనుమానమొచ్చి కూతురు ఇంటికెళ్లి చూశాడు. ఇల్లు బయట తాళం వేసి కనిపించింది.

    రాంప్రకాష్ పోలీసులకు సమాచారం అందించాడు. తాళం బద్ధలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా రక్తపు మడుగులో సరోజా పడి ఉంది. ఆమెను తుపాకితో కాల్చినట్టు పోలీసులు గుర్తించారు. ఆమె మృతదేహాన్ని చూసి సరోజా కుటుంబం కుప్పకూలిపోయింది. సరోజా సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు యతేంద్రతో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో నివ్వెరపోయే నిజాలు వెలుగుచూశాయి. ఆమెను తీవ్రంగా గాయపరచి.. ఆ తర్వాత ఆమె శరీరంలోకి నాలుగు బుల్లెట్లను దింపి కిరాతకంగా హత్య చేసినట్లు తెలిసింది. ఇల్లు లాక్ చేసి అక్కడ నుంచి పరారైన యతేంద్ర కోసం పోలీసులు గాలిస్తున్నారు.

    ఇది కూడా చదవండి: Very Sad: ఊరుకో తల్లీ.. ఏం చేస్తాం.. ఏదీ మన చేతుల్లో లేదు.. ఇలా జరగకుండా ఉండాల్సింది..

    భార్యాభర్తల మధ్య గొడవల వల్లే భర్త ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటన జరిగిన సమయంలో ముగ్గురు పిల్లలు ఇంట్లో లేరు. నిందితుడిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కూతురి మృతదేహాన్ని చూసి సరోజా తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. అల్లుడికి తాము ఎలాంటి లోటు చేయలేదని, ఆర్థికంగా కూడా పలుసార్లు సాయపడ్డామని, కూతురు సంతోషంగా ఉండాలని అల్లుడికి ఏ లోటు రాకుండా చూసుకుంటే చివరికిలా చేస్తాడని అనుకోలేదని ఆమె కుటుంబం భోరున విలపించింది.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Crime news, Family dispute, Married women, Uttarpradesh, Wife murdered

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు