Home /News /crime /

A GROUP OF PEOPLE DEMAND RS 10 CRORE AFTER HACKING GHAZIABAD MAN EMAIL HSN

ఈ మెయిల్ లో వీడియోలు.. హ్యాక్ చేసి రూ.10 కోట్లు డిమాండ్.. లబోదిబోమంటున్న బాధితుడు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పాస్ వర్డ్ మనకు తప్ప ఇంకెవరికీ తెలియదు కదా అన్న ధీమాతో వ్యక్తిగత వివరాలకు సంబంధించిన వాటిని ఈమెయిల్స్ లోనూ, సోషల్ మీడియా ఖాతాల్లోనూ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు అవే వారి కొంప ముంచుతోంది. తాజాగా ఓ వ్యక్తి హ్యాకర్ల బారిన పడ్డాడు.

    ప్రస్తుత టెక్ యుగంలో ఏ ఒక్కటి కూడా సురక్షితం కాదని కొన్ని ఘటనలను చెప్పకనే చెబుతున్నాయి. వ్యక్తిగత వివరాలు, వీడియోలు, ఫొటోలు ఏ ఒక్కటి కూడా సోషల్ మీడియా ఖాతాల్లో పెట్టుకోవద్దని టెక్ నిపుణులు చెబుతూనే ఉన్నారు. అయినప్పటికీ వాటిని గ్రహించకుండా, ఏం కాదులే, పాస్ వర్డ్ మనకు తప్ప ఇంకెవరికీ తెలియదు కదా అన్న ధీమాతో వ్యక్తిగత వివరాలకు సంబంధించిన వాటిని ఈమెయిల్స్ లోనూ, సోషల్ మీడియా ఖాతాల్లోనూ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు అవే వారి కొంప ముంచుతోంది. తాజాగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఓ వ్యక్తి హ్యాకర్ల బారిన పడ్డాడు. ఏకంగా పది కోట్ల రూపాయలను హ్యాకర్లు డిమాండ్ చేస్తున్నారు. శనివారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ నగరంలోని వసుందర కాలనీకి చెందిన ఓ వ్యక్తి ఈ మెయిల్ ను కొందరు సైబర్ దుండగులు హ్యాక్ చేశారు. అందులోంచి ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను కలెక్ట్ చేశారు. దాంతోపాటు అతగాడికి సంబంధించిన కొన్ని ప్రైవేటు వీడియోలను కూడా సేకరించారు. బ్యాంక్ అకౌంట్ల పాస్ వర్డ్ దగ్గర నుంచి సోషల్ మీడియా ఖాతా పాస్ వర్డ్ ల వరకు అన్నింటినీ ఆ మెయిల్ నుంచి తీసుకున్నారు. ఆ తర్వాత ఆ వ్యక్తిని సంప్రదించి ఏకంగా పది కోట్ల రూపాయలను డిమాండ్ చేశారు.

    ‘మేం చెప్పినట్టు పది కోట్ల రూపాయలు ఇవ్వకపోతే మీ కుటుంబ సభ్యుల వీడియోలు, మీ ప్రైవేటు వీడియోలను సోషల్ మీడియా ఖాతాల్లో పెడతాం..‘ అని బాధితుడికి వార్నింగ్ మెసేజ్ లు పంపారు. దీంతో భయపడిపోయిన అతడు శనివారం పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ పోలీసులకు ఈ కేసును అప్పగించారు. బాధితుడిని హెచ్చరిస్తున్న హ్యాకర్లను వీలయినంత త్వరగా పట్టుకుంటామని సైబర్ డిపార్ట్ మెంట్ పోలీసులు చెబుతున్నారు. వ్యక్తిగత వివరాలను ఈమెయిల్స్, సోషల్ మీడియా ఖాతాల్లో సేవ్ చేసుకోవద్దని సూచించారు.
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Crime news, CYBER CRIME, Hacking, Online fraud

    తదుపరి వార్తలు