A GIRL FROM BIHAR WAS ALLEGEDLY HARASSED AFTER SHE WAS CAUGHT SITTING WITH A MALE FRIEND SSR
నిర్మానుష్య ప్రాంతంలో యువకుడితో బాలిక.. ఇంతలో అక్కడికి కొందరు యువకులు.. చివరికి...
ఘటనా స్థలంలో బాధితురాలు
బీహార్‌లో కొందరు యువకులు ఓ జంటపై చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని మోరల్ పోలీసింగ్‌కు పాల్పడ్డారు. ఓ యువకుడితో నిర్మానుష్య ప్రాంతంలో కూర్చుని కనిపించిందన్న నెపంతో పాఠశాల విద్యార్థినిపై కొందరు యువకులు వేధింపులకు పాల్పడిన ఘటన...
గయా: బీహార్‌లో కొందరు యువకులు ఓ జంటపై చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని మోరల్ పోలీసింగ్‌కు పాల్పడ్డారు. ఓ యువకుడితో నిర్మానుష్య ప్రాంతంలో కూర్చుని కనిపించిందన్న నెపంతో పాఠశాల విద్యార్థినిపై కొందరు యువకులు వేధింపులకు పాల్పడిన ఘటన బీహార్‌లోని గయాలో వెలుగుచూసింది. ఈ ఘటన మొత్తాన్ని నిందితులు ఫోన్లో వీడియో తీయడం గమనార్హం. ఆ బాలిక వీడియో తీయొద్దని బతిమలాడినా ఆ యువకులు వినలేదు. స్కార్ఫ్ కట్టుకుని ముఖం కనిపించకుండా ఆ బాలిక కవర్ చేసుకుంటున్నా ముఖం చూపించాలని బలవంతం చేసి వీడియో తీశారు. ఫిబ్రవరి 20న ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. ఆ బాలికతో వచ్చిన యువకుడిని ఒక గ్రూపుగా వచ్చిన యువకులు కొట్టారు. వీడియో తీయొద్దని.. సోషల్ మీడియాలో పెట్టొద్దని బాధిత బాలిక వేడుకున్నా ఆ యువకులు వినలేదు. ఆ బాలికను బండబూతులు తిడుతూ వాళ్ల తండ్రి పేరు చెప్పమని, అడ్రస్ చెప్పమని బెదిరించారు. దీంతో.. తమది ఫతేపూర్ అని ఆ బాలిక చెప్పింది.
అంతటితో ఈ మూక ఆగలేదు. అన్ని వివరాలు చెప్పాలని బలవంతం చేశారు. ఆ యువకుడిపై దాడికి పాల్పడిన యువకులు అతని వివరాలు చెప్పాలని బెదిరించారు. చివరికి.. ఆ బాలిక అక్కడ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించింది. ఆ యువకుడు వెంటపడి మళ్లీ వెనక్కి తీసుకొచ్చారు. చున్నీ లాగేసి అసభ్యంగా ప్రవర్తించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఈ ఘటనపై స్పందించిన గయా ఎస్ఎస్పీ ఆదిత్య కుమార్ మాట్లాడుతూ.. మోరల్ పోలీసింగ్‌కు పాల్పడిన నిందితులను అరెస్ట్ చేయమని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా.. కేరళలో మోరల్ పోలీసింగ్ ఓ వివాహిత ప్రాణం తీసింది. తన భర్త స్నేహితుడు తరచుగా ఇంటికి వచ్చి వెళుతుండటంతో భార్యను కొందరు యువకులు సూటిపోటి మాటలతో వేధించారు. అతనితో అఫైర్ పెట్టుకున్నావని ఆమెను నిందించారు. తీవ్ర మనస్తాపం చెందిన ఆ 38 ఏళ్ల వివాహిత చేతిని కోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె గత శుక్రవారం మృతి చెందింది.