హోమ్ /వార్తలు /క్రైమ్ /

Wife Lover: అతని భార్యతో ఇతను గడిపిన వీడియో నెట్‌లో పెట్టాడు.. పాపం.. ఆమె భర్త ఆ వీడియోను చూసి..

Wife Lover: అతని భార్యతో ఇతను గడిపిన వీడియో నెట్‌లో పెట్టాడు.. పాపం.. ఆమె భర్త ఆ వీడియోను చూసి..

నిందితుడు విష్ణు

నిందితుడు విష్ణు

వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. తన జీవిత భాగస్వామి మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న విషయం తెలిసి కొందరు హత్యలకు పాల్పడుతుంటే.. మరికొందరు ఆ బాధను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.

ఇడుక్కి: వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. తన జీవిత భాగస్వామి మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న విషయం తెలిసి కొందరు హత్యలకు పాల్పడుతుంటే.. మరికొందరు ఆ బాధను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. భార్య మరొకరితో వివాహేతర సంబంధం నెరుపుతున్న వీడియో వైరల్ కావడం, ఆ వీడియో భర్త వరకూ వెళ్లడంతో.. భార్యను ఆ స్థితిలో మరొకరితో ఆ వీడియోలో చూసిన భర్త తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తాజాగా ఈ కేసులో తప్పించుకుని తిరుగుతున్న భార్య, ఆమె ప్రియుడి అరెస్ట్‌తో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొన్నేళ్ల క్రితం శివకుమార్, అఖిల ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. 2016-17 సమయంలో పెళ్లైన తర్వాత అఖిల ఓ గ్యాస్ ఏజెన్సీలో పనిచేసింది. ఆ సమయంలో ఆమెకు విష్ణు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.

ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను మరిచి విష్ణుతో అఖిల వివాహేతర సంబంధం సాగించింది. పలుమార్లు విష్ణు, అఖిల శారీరకంగా కలిశారు. భర్తకు ఏదో ఒక సాకు చెప్పడం, ఆఫీస్‌లో పని ఇంకా అవ్వలేదని చెప్పి విష్ణుతో కలిసి గడపడమే అఖిల పనిగా పెట్టుకుంది. ఆమెకు పెళ్లై ఇద్దరు పిల్లలున్నారన్న సంగతి తెలిసి కూడా విష్ణు ఆమెతో అఫైర్ కొనసాగించాడు. కొన్నేళ్ల పాటు వీరి అఫైర్ నడిచింది. విష్ణు, అఖిల శారీరకంగా కలిసిన సమయంలో విష్ణు ఫోన్‌లో వీడియో తీశాడు. కేవలం తాను చూసుకోవడానికని, ఎందులో పోస్ట్ చేయనని అఖిలకు విష్ణు చెప్పాడు. ఈ క్రమంలో కొన్నాళ్లకు అఖిల విష్ణుతో వివాహేతర సంబంధం సాగిస్తుందన్న విషయం ఆమె భర్త శివకుమార్‌కు తెలిసింది. భార్యను ఇదేం పని అని నిలదీశాడు. భార్యాభర్తల మధ్య పెద్ద గొడవే జరిగింది. తన భర్తతో గొడవ జరిగిన విషయాన్ని అఖిల విష్ణుతో చెప్పింది.

ఇది కూడా చదవండి: Mother: కొడుకు సైకిల్ పోగొట్టుకుని అన్నం తినకుండా ఏడుస్తుంటే కన్న తల్లి ఏం చేసిందో చూడండి..

విష్ణు అఖిలతో గడిపిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అవమానంతో భార్యను వదిలేస్తాడని, ఆ తర్వాత అఖిలతో ఇబ్బంది లేకుండా గడపవచ్చని విష్ణు ఈ పని చేశాడు. ఆ వీడియో వైరల్ కావడంతో తన భార్యను మరొకరితో ఆ స్థితిలో చూసిన శివకుమార్ తీవ్ర మనస్తాపంతో 2019, సెప్టెంబర్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భర్త చనిపోయిన సందర్భంలో అఖిల మొసలి కన్నీరు కార్చుతూ కనిపించడంతో ఎవరికీ అనుమానం రాలేదు. కానీ.. శివకుమార్ ఆత్మహత్యపై అనుమానం వ్యక్తం చేస్తూ అతని సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అతని భార్యకు, విష్ణుకు మధ్య వివాహేతర సంబంధం ఉందని ఇటీవల తేల్చారు. అయితే.. ఈ కేసులో నిందితుడైన విష్ణు ఇంటికెళ్లి చూడగా అఖిల కూడా అతనితోనే ఉంది. భర్త చనిపోయిన తర్వాత అఖిల, విష్ణు కలిసి ఉంటున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. శివకుమార్ ఆత్మహత్యకు కారణమైనందుకు పోలీసులు విష్ణును, అఖిలను అదుపులోకి తీసుకున్నారు.

First published:

Tags: Crime news, Extra marital affair, Husband commits suicide, Wife

ఉత్తమ కథలు