Home /News /crime /

A FIVE MONTH PREGNANT WOMAN WAS SHOT DEAD IN BROAD DAYLIGHT ON SUNDAY IN SRI GANGANAGAR DISTRICT OF RAJASTHAN SSR

pregnant woman: చిన్న కొడుకు కోరిక తీర్చాలని కోడలిని బలవంతం చేసిన అత్త... చివరికి ఎంతపని చేశారంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

శ్రీ గంగానగర్‌ జిల్లాకు చెందిన పల్లవిని గత సంవత్సరం మే నెలలో అన్సుల్ చబ్రాకు ఇచ్చి వివాహం చేశారు. పెళ్లైన కొన్నాళ్లు భర్త పల్లవితో అన్యోన్యంగానే ఉన్నప్పటికీ రానురానూ ఆమెకు అత్తారింట్లో వేధింపులు పెరిగిపోయాయి. పల్లవి ఐదు నెలల గర్భిణి. అయినప్పటికీ ఆమెకు మెట్టినింట్లో వేధింపులు తప్పలేదు. తన చిన్న కొడుకుతో సంబంధం పెట్టుకోవాలని ఆమె అత్తే పల్లవిని వేధించిందని...

ఇంకా చదవండి ...
    జైపూర్: కామంతో కళ్లుమూసుకుపోయి మృగాల్లా ప్రవర్తిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ పోతోంది. వావివరసలు మరిచి కొందరు మగాళ్లు మృగాళ్లలా మారిపోతున్నారు. అన్న భార్యపై కన్నేసిన ఓ తమ్ముడు తన కోరిక తీర్చమంటూ వదినను బలవంత పెట్టాడు. ఆమె కుదరదని కన్నెర్ర చేయడంతో కాల్చి చంపాడు. రాజస్తాన్‌లో ఈ ఘోరం జరిగింది. ఐదు నెలల గర్భిణిని ఆమె మరిదే కాల్చి చంపిన ఘటన శ్రీ గంగానగర్ జిల్లాలో కలకలం రేపింది. పట్టపగలే ఈ ఘోరం జరగడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. శ్రీ గంగానగర్‌ జిల్లాకు చెందిన పల్లవిని గత సంవత్సరం మే నెలలో అన్సుల్ చబ్రాకు ఇచ్చి వివాహం చేశారు. పెళ్లైన కొన్నాళ్లు భర్త పల్లవితో అన్యోన్యంగానే ఉన్నప్పటికీ రానురానూ ఆమెకు అత్తారింట్లో వేధింపులు పెరిగిపోయాయి. పల్లవి ఐదు నెలల గర్భిణి. అయినప్పటికీ ఆమెకు మెట్టినింట్లో వేధింపులు తప్పలేదు. తన చిన్న కొడుకుతో సంబంధం పెట్టుకోవాలని ఆమె అత్తే పల్లవిని వేధించిందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పల్లవి తండ్రి పేర్కొన్నాడు.

    అంతేకాదు, పల్లవి పెళ్లైన కొన్నాళ్లకు ఆమె మామ చనిపోయాడని, ఆయన చావుకు కూడా తన కుమార్తెను నిందించేవారని చెప్పాడు. శనిలా దాపురించిందని, పెళ్లైన కొన్నాళ్లకే ఇంటి పెద్దను బలి తీసుకుందని తన కుమార్తెను అత్తింటివారు సూటిపోటి మాటలతో వేధించారని పల్లవి తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపాడు. అదనపు కట్నం కోసం వేధించి.. ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించారని చెప్పాడు. ఆదివారం నాడు తమ కుమార్తెను ఆమె మరిది బలవంతం చేయబోయాడని, ఆమె ప్రతిఘటించడంతో కాల్చి చంపాడని పల్లవి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నాడు.

    ఇది కూడా చదవండి: ఒంటి మీదకు 68 ఏళ్ల వయసొచ్చింది.. ఎంత సిగ్గుమాలిన పనిచేసి దొరికిపోయాడో తెలిస్తే...



    స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం 9.40 నిమిషాలకు పల్లవి ఉంటున్న ఇంటి నుంచి కాల్పుల శబ్దం వినిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకునేలోపు బాధితురాలు ప్రాణాలు కోల్పోయింది. ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి అత్తను, మరిదిని పోలీసులు అరెస్ట్ చేశారు. పల్లవి అప్పటికే వేరే కేసులో అరెస్టయి ఉండటం గమనార్హం. చనిపోయే ముందు రోజు పల్లవి పుట్టింటికి ఫోన్ చేసి మెట్టినింట్లో తనకు ఎదురవుతున్న ఇబ్బందుల గురించి తల్లిదండ్రులతో మొరపెట్టుకుంది. మరుసటి రోజే ఆమెను కాల్చి చంపారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Crime, Crime news, Jaipur, Murder, Rajastan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు