సోషల్‌మీడియా (Social media)లో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్తగా మరో దందాకు తెరదీశారు. సోషల్‌మీడియా వేదికలపైన ఇన్స్టాగ్రామ్ (Instagram), వాట్సాప్ (WhatsApp)లను వాడుకుని అశ్లీల కార్యకలాపాలు చేస్తున్నారు. అయితే ఈ సారి ఏకంగా సోషల్‌మీడియా యూజర్స్( Social media Users) ఫొటోలను తీసుకుని మార్ఫింగ్ చేసి మరీ వదులుతున్నారు. అవి కూడా సదరు యూజర్స్ బంధువులు, స్నేహితులకు మార్ఫింగ్ సెక్స్ చాట్ వీడియోలు (sex chat videos) పంపించేస్తున్నారు. ఆ తర్వాత అలాంటి వీడియోలు పంపకూడదంటే డబ్బులు కావాలని డిమాండ్ చేయడం మొదలుపెడుతున్నారు. ఈ దందా హర్యానా, యూపీ, రాజస్థాన్‌లు అడ్డాగా సాగుతోంది. ఇంతకీ సోషల్ మీడియా ఉపయోగించి ఆ మార్ఫింగ్ వీడియోలు ఎలా చేస్తున్నారంటే..
ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. హర్యానా (Haryana), యూపీ(UP), రాజస్థాన్లలో (Rajasthan)ని భరత్పూర్ (Bharathpur), మధుర(madura), మేవాట్(Mewat) ప్రాంతాల నుంచి ఈ దందా నడిపిస్తున్నారని పోలీసులు (police) చెబుతున్నారు. ఢిల్లీ(Delhi)కి చెందిన బాసిన్ అనే వ్యక్తికి జరిగిన సంఘటనపై పోలీసులు వివరిస్తూ.. ముందుగా ఇన్స్టాగ్రామ్ (Instagram)లో తెలియని ఒక అమ్మాయి (Unknown girl) అతనికి డైరెక్ట్ మెసేజ్ (direct message) పంపించి, వాట్సాప్ (WhatsApp) నంబర్ అడుగుతుంది. ఆ అబ్బాయికి వ్యక్తిగతంగా తను తెలియదు కాబట్టి రిజెక్ట్ (Reject) చేశాడు. కానీ, కొన్ని నిమిషాల్లోనే ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో కాల్(video call) చేయడం ప్రారంభించింది. మొదట్లో తనూ పట్టించుకోలేదు. కానీ, ఏడు నుంచి ఎనిమిది కాల్స్ తర్వాత స్పందించాడు.
ఇక ఆ అమ్మాయి నగ్న వీడియో కాల్(Nude video calls) చేయడం ప్రారంభించింది. ఏం జరుగుతుందో తెలియడానికి దాదాపు 15 సెకన్లు పట్టింది ఆ అబ్బాయికి. వెంటనే కాల్ డిస్కనెక్ట్ (Disconnect) చేశాడు. అయితే అబ్బాయి కుటుంబీకులు, స్నేహితులకు ఓ సెక్స్ చాట్ వీడియో (Sex chat videos))లు పంపడం ప్రారంభించింది ముఠా. ఈ వీడియోల్లో అబ్బాయి ముఖాన్ని మార్ఫింగ్ (morphing) చేసి.. ఆ సెక్స్ చాట్ వీడియోలో అబ్బాయే ఉన్నట్లు చేశారు. దీంతో బంధువులు, స్నేహితులు(Relatives and friends) షాక్ అయ్యారు. వీడియో కాల్(video call) చేసినపుడు అబ్బాయి(boy) ఫొటో(photo)ను వాడుకుని ఈ పని చేశారు కేటుగాళ్లు.
దీంతో అతను ఢిల్లీ(Delhi) డిఫెన్స్ కాలనీలోని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేశాడు. ఆగ్రా సైబర్ క్రైమ్ పోలీసులు ఈ నేరానికి పాల్పడిన మేవాట్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. బాసిన్ను టార్గెట్ చేసింది ఇదే ముఠా అని పోలీసులు భావిస్తున్నారు. చూశారు కదా.. ఇక ఎవరైనా తెలియని వాళ్లు సోషల్ మీడియాలో రిక్వెస్ట్‌లు పెట్టినా, వీడియో కాల్స్ చేసినా స్పందించే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. మీరు ఇలాంటి మాయగాళ్ల ఉచ్చులో పడొద్దు.
ఇది కూడా చదవండి: వీడెవడండీ బాబూ.. వాడేసిన 730 అండర్వేర్లను దొంగతనం చేశాడంట.. ఎక్కడో తెలుసా
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Blackmail, Criminal women, CYBER CRIME, Cyber criminals, Haryana police, Instagram, Money, Nude video calls, Rajasthan, Sex Racket, Whatsapp