A FIGHT WHICH STARTED BETWEEN A COUPLES ON THE ISSUE OF THE WIFE INABILITY TO MAKE TASTY CHICKEN FRY ENDED IN THE MURDER OF THE LADY SSR
Chicken Fry: బెంగళూరులో షాకింగ్ ఘటన.. ఆ ఇల్లాలి జీవితానికి ముగింపు పలికిన చికెన్ ఫ్రై..
ప్రతీకాత్మక చిత్రం
భార్యాభర్తల మధ్య చిన్నచిన్న మనస్పర్థలు సహజం. కానీ.. అవి ముదిరిముదిరి పాకాన పడితే ఏదో ఒక వంకతో కావాలనే గొడవ పెట్టుకుని తిట్టుకుంటూకొట్టుకుంటూ ఉంటారు. ఇంకొందరైతే క్షణికావేశంలో జీవిత భాగస్వామిని హత్య చేసేందుకు కూడా వెనుకాడటం లేదు. బెంగళూరు నగరంలో సరిగ్గా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది.
బెంగళూరు: భార్యాభర్తల మధ్య చిన్నచిన్న మనస్పర్థలు సహజం. కానీ.. అవి ముదిరిముదిరి పాకాన పడితే ఏదో ఒక వంకతో కావాలనే గొడవ పెట్టుకుని తిట్టుకుంటూకొట్టుకుంటూ ఉంటారు. ఇంకొందరైతే క్షణికావేశంలో జీవిత భాగస్వామిని హత్య చేసేందుకు కూడా వెనుకాడటం లేదు. బెంగళూరు నగరంలో సరిగ్గా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వయసున్న కర్ణాటకకు చెందిన వ్యాపారవేత్త పాషా. భార్య వండిన చికెన్ ఫ్రై బాగోలేదని.. ఆమెతో గొడవపెట్టుకుని ఆమెను హతమార్చాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని చిక్కబనవర లేక్‌లో పడేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాషా(30), షిరిన్ భాను(28)కు కొన్నేళ్ల క్రితం పెళ్లైంది. వీరిది ప్రేమ పెళ్లి కావడం గమనార్హం. ఐదేళ్ల క్రితం వీళ్లిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పాషా, షిరిన్ భానుకు ముగ్గురు పిల్లలు. పాషా బెంగళూరులో బెడ్స్ అమ్ముతూ.. బిజినెస్ చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు.
ఈ ఇద్దరి స్వస్థలం దావణగెరె జిల్లా కావడం గమనార్హం. కొన్ని వారాల క్రితం.. షిరిన్ చెల్లెలు అక్క ఇంటికి వచ్చింది. ఆ సమయంలో షిరిన్ చికెన్ ఫ్రై చేసింది. అయితే.. చికెన్ ఫ్రై సరిగ్గా వండలేదని.. ఇదేం వండటమని భార్యపై ఆమె చెల్లి ముందే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. అసలు రుచిగానే లేదని.. ఏదీ సరిగా వండటం రాదని ఆమెను నానా మాటలన్నాడు. ఈ పరిణామం భార్యాభర్తలిద్దరి మధ్య దూరాన్ని పెంచింది. తన తోడబుట్టిన చెల్లి ముందు భర్త తన పరువు తీసేలా మాట్లాడాడని షిరిన్ తీవ్ర మనస్తాపానికి లోనైంది. కొన్నిరోజుల తర్వాత ఆమె చెల్లి బెంగళూరు నుంచి సొంతూరికి వెళ్లిపోయింది. ఆమె ఉన్నన్ని రోజులు మౌనంగా ఉన్న షిరిన్, పాషా ఆమె వెళ్లిపోగానే గొడవ పడటం మొదలుపెట్టారు. ఇటీవల ఒకరోజు రాత్రి.. పిల్లలు వేరే గదిలో నిద్రిస్తుండగా భార్యాభర్తలిద్దరూ ఆ చికెన్ ఫ్రై గురించి గొడవపడ్డారు.
రుచిగా లేకపోతే ఆ విషయాన్ని తనకు చెప్పొచ్చని.. అంతేగానీ తన చెల్లి ముందు అలా అరిచి అవమానపరచడం ఎంతవరకూ సబబని భర్తను షిరిన్ నిలదీసింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. గొడవ చిలికిచిలికి గాలివానగా మారింది. క్షణికావేశంలో సహనం కోల్పోయిన పాషా భార్యను మూలన ఉన్న కర్రతో తలపై గట్టిగా కొట్టాడు. దెబ్బ బలంగా తగలడంతో తీవ్ర రక్తస్రావమై కొద్దిసేపటికే షిరిన్ కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయింది. షిరిన్ మృతదేహాన్ని మాయం చేయాలని భావించిన పాషా ఆమె మృతదేహాన్ని చిక్కబనవర లేక్‌లో పడేశాడు. అయితే.. పోలీసులు పాషాను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. షిరిన్ మృతదేహం కోసం లేక్‌లో గాలిస్తున్నారు.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.