Home /News /crime /

A FATHER WHO RAPED HIS DAUGHTER FOR THREE MONTHS IN KOTHAGUDEM DISTRICT DETAILS HERE KMM VB

Father And Daughter: ఇంత దారుణమా.. కన్న తల్లిదండ్రులే ఇలా చేస్తే.. ఆ బాలిక ఇంకెవరికి చెప్పుకోవాలి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Crime News: కన్నతండ్రే కాటేయబోయాడు.. రక్షకుడే భక్షింపజూశాడు..ఇంటర్‌ చదువుతున్న కుమార్తెపై కన్నేసిన తండ్రి కసాయిగా మారాడు. ఆమెపై మూడు నెలలుగా తీవ్రమైన లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. సాక్షాత్తూ కన్నతండ్రే ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడుతుండడంతో పాపం ఆ బాలికకు ఏంచేయాలో పాలుపోలేదు. చివరకు ఆ బాలిక ఏం చేసిందంటే..

ఇంకా చదవండి ...
    (G.SrinivasReddy,News18,Khammam)

    కన్నతండ్రే కాటేయబోయాడు.. రక్షకుడే భక్షింపజూశాడు..ఇంటర్‌ చదువుతున్న కుమార్తెపై కన్నేసిన తండ్రి కసాయిగా మారాడు. ఆమెపై మూడు నెలలుగా తీవ్రమైన లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. సాక్షాత్తూ కన్నతండ్రే ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడుతుండడంతో పాపం ఆ బాలికకు ఏంచేయాలో పాలుపోలేదు.ఈ విషయాన్ని అతి కష్టం మీద తల్లికి చెప్పినా ఆమె సైతం పట్టించుకోలేదు సరికదా.. భర్తకే సపోర్ట్‌ చేసినట్టు మాట్లాడింది. దీంతో హతాశురాలైన ఆ బాలిక లోలోపలే కుమిలిపోయింది. తను పడుతున్న వేదనను ఎవరికి చెప్పుకోవాలో తెలీక లోలోపలే నలిగిపోయింది. పంటిబిగువన భయం భయంగా రోజులు నెట్టుకొస్తోంది.

    Crime News: కిటికీ అద్దం పగలకొట్టారు.. దానికి కారణం ఎవరనే తేల్చుకునే పనిలో ఇలా జరిగింది..


    కానీ రోజురోజుకూ తండ్రి వేధింపులు అధికం కావడంతో దిక్కుతోచని ఆ అభాగ్యురాలు బంధువులకు తన గోడు చెప్పుకుంది. ధైర్యం చెప్పిన బంధువులు ఆమెను వెంటబెట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాధితురాలిని ఐసీడీఎస్ అధికారుల చెంతకు చేర్చి ఆమెకు రక్షణ, వసతి కల్పించారు. రోజురోజుకూ మానవత్వం మంటకలసి పోతున్న పరిస్థితుల్లో వావి వరుసలు మరచిన వ్యక్తి చివరకు కన్నబిడ్డ పైనే కన్నేశాడు. ఎక్కడ చూసినా ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోతున్న పరిస్థితుల్లో చివరకు పుట్టిన ఇంట్లోనూ లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయి. పైగా రక్షించాల్సిన తండ్రే భక్షించాలని చూడడంతో.

    కన్న కూతురుపై అత్యాచారం చేయబోయాడు.. కానీ ఆమె ఇలా చేస్తుందని ఊహించలేకపోయాడు.. ఏం చేసిందంటే..


    ఎవరికి చెప్పుకోవాలో తెలీని దిక్కుతోచని పరిస్థితుల్లో కన్నతల్లికి చెప్పుకున్నా.. ఆమె కూడా భర్తకే సపోర్ట్‌ చేయడంతో ఆ బాలిక దిక్కులేనిదైంది. విధిలేని పరిస్థితుల్లో బంధువులకు చెప్పుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని 12 వార్డులో ఓ కన్న తండ్రి తన కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు అని, వేధింపులకు గురి చేస్తున్నాడని ఓ తండ్రి పై కన్న కూతురు అభియోగం మోపింది.

    రైల్వేస్టేషన్ వద్ద వారిద్దరు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు.. వారిని ప్రేమికులు అనుకున్నారు.. కానీ ఇంతలోనే..


    12వ వార్డు కు చెందిన పవన్ పాసి తన కూతురు అంజలిని వేధింపులకు గురి చేస్తున్నాడని ఐ సి డి ఎస్ అడిషనల్ సిడిపిఓ కు సమాచారం తెలియడంతో సంఘటన స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యుల మధ్య విచారణ చేపట్టి కూతురు అంజలి అభిప్రాయం మేరకు కొత్తగూడెం చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి తరలించారు. ఈ విషయమై 'న్యూస్18 తెలుగు' ఖమ్మం జిల్లా ప్రతినిధి ఇల్లెందు ఏరియా ఐసీడీఎస్‌ అడిషనల్‌ సీడీపీవో విజయకుమారిని సంప్రదించగా బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులకు కేసును రిఫర్‌ చేశామని, బాలిక ప్రస్తుతం జిల్లా ఛైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ పరిరక్షణలో ఉందన్నారు. ఈ కేసు విచారణను ఆ కమిటీ పర్యవేక్షిస్తుందన్నారు.
    Published by:Veera Babu
    First published:

    Tags: Bhadrari kothagudem, Crime news, Khammam, Minor girl pregnant, Minor girl raped

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు