మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి క్షణికావేశంలో కన్నకొడుకులను తుపాకీతో కాల్చేశాడు. అంతటితో ఆగకుండా తాను సైతం అదే తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. చంద్రపూర్ జిల్లా బల్లాపూర్ పట్టణానికి చెందిన మూల్‌చంద్ ద్వివేది(50)కి తన కుటుంబ సభ్యులతో నివసిస్తున్నాడు. అతడికి లైసెన్స్డ్ తుపాకీ ఉంది. అయితే మంగళవారం కుటుంబ సభ్యులతో చిన్నవిషయమై మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. దీంతో కోపోద్రిక్తుడైన మూల్‌చంద్ తన కొడుకులైన ఆకాశ్(22), పవన్(20)లపై తుపాకీతో కాల్పులకు దిగాడు. అనంతరం మూల్‌చంద్ సైతం తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆకాశ్‌ను చంద్రపూర్ జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. మరో కొడుకు పవన్ అదే ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Gun fire, Maharashtra