A FAMILY WAS BRUTALLY MURDERED BY THEIR FELLOW VILLAGERS IN THE NAME OF BLACK MAGIC ALLEGATIONS IN JAGITYAL KNR PRV
Brutally Murder: మంత్రాల నెపంతో తండ్రీ కొడుకులను బహిరంగంగా కత్తులతో హతమార్చిన ప్రత్యర్ధులు.. కుల సమావేశంలో ఘటన
రోదిస్తున్న కుటుంబ సభ్యులు
మంత్రాల నెపం, పాత కక్ష్యలతో తండ్రీకొడుకులను హతమార్చిన ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగింది. కుల సంఘం సమావేశంలో చెలరేగిన ఘర్షణల సందర్భంగా ప్రత్యర్థు లు దాడి చేయడంతో అక్కడికక్కడే మరణించారు .
మంత్రాల నెపం, పాత కక్ష్యలతో తండ్రీకొడుకులను హతమార్చిన (Brutally Murder) ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగింది. కుల సంఘం సమావేశంలో చెలరేగిన ఘర్షణల సందర్భంగా ప్రత్యర్థు లు దాడి చేయడంతో అక్కడికక్కడే మరణించారు . కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు . మృతులను జగన్నాథం నాగేశ్వర రావు , అతని కుమారులు రాంబాబు, రమేష్‌లుగా గుర్తించారు. జగిత్యాల (Jagityal) పట్టణంలోని టి ఆర్ నగర్ కు చెందిన జగన్నాథం నాగేశ్వర్, అతనికి కుమారులు జగన్నాథం రాంబాబు , రాజేష్ , రమేష్. అయితే వీరి కుల సంఘం సమావేశం ఆరు నెలలకు ఒకసారి జరుగుతుంది. ఈ మేరకు గురువారం జరిగిన కుల సంఘ సమావేశానికి నాగేశ్వర్ ముగ్గురు కుమారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రత్యర్థులు వీరిపై పగతో, మంత్రాలు చేస్తున్నారనే నెపంతో కుటుంబం మొత్తాన్ని అంతమొందించాలని పక్కా ప్లాన్‌తో మారణాయుధాలతో సమావేశానికి వచ్చారు.
సమావేశం (Meeting) జరుగుతుండగా జరిగిన ఘర్షణలో వనం దుర్గయ్య , వనం గంగయ్యలతో మరికొందరు మారణాయుధాలతో జగన్నాథం నాగేశ్వర్ అతని కుమారులు రాంబాబు , రమేష్ , రాజేష్‌ల పై దాడి చేశారు . ప్రత్యర్దుల దాడి నుంచి రాజేష్ తప్పించుకోగా , జగన్నాథం నాగేశ్వర్ , రాంబాబు రమేష్‌లు ప్రత్యర్థుల దాడిలో మృతి చెందారు .
పెద్ద మనిషిగా ఉండటమేనా?
జగన్నాథం నాగేశ్వర్ కుల సంఘం లో పెద్దమనిషిగా ఉండటం , కాలనీలో మంచి పలుకుబడి ఉండటంతో జీర్ణించుకోలేక ప్రత్యర్థులు దాడి చేశారని స్థానికులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరికొందరేమో మంత్రాల నెపం (In the name of black magic)తో హత్య చేశారని అంటున్నారు. సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ సింధు శర్మ , ఏఎస్పీ రూపేష్‌లు పరిశీలించారు. జగిత్యాల డీఎస్పీ ప్రకాశ్‌ను సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీసుల బృందం తోపాటు , డాగ్ స్క్వా డ్ సహాయంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మృతుల కుటుoబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు .
కాగా, ఇటీవలె ములుగు జిల్లాలో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం బొల్లెపల్లి గ్రామంలో తోలెం విజయ్ కుమార్ అనే యువకుడు గత ఐదేళ్లుగా కూలీ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నాడు. గ్రామానికి చెందిన పూనేం సురేష్ (22) యొక్క చెల్లె నీలవేణి 6 నెలల క్రితం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. అయితే తన చెల్లెలి చావుకు విజయ్ కుమార్ కారణమని సురేష్ అతనిపై కక్ష పెంచుకున్నాడు. విజయ్ మంత్రాలు చేయడం వల్లే తన చెల్లెలు ఆత్మహత్య చేసుకుందని అనుమానించాడు. ఈ క్రమంలో రాత్రి సురేష్ .. విజయ్ ఇంటికి గొడ్డలి పట్టుకుని వెళ్లి గొడవ పెట్టుకున్నాడు. తరువాత అతన్ని ఇంటి బయటకు లాక్కొచ్చి అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపివేశాడు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.